Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..

Health Tips: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి.

Health Tips: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తినొచ్చు.. ఏ పండ్లు తినొద్దు.. పూర్తి వివరాలు మీకోసం..
Fruits Sugar
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 17, 2021 | 6:38 PM

Health Tips: పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. పండ్లలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, నీటికి పండ్లు ప్రధాన మూలం. అంతేకాదు.. ఇవి సహజ సిద్ధమైన తీపిని కలిగి ఉంటాయి. అయితే, పళ్లలోని సహజ చెక్కెర గురించి చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు పండ్లను తినేందుకు జంకుతుంటారు. వాస్తవానికి పండ్లలోని తీపి పదార్థం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని పండ్లలో మాత్రం షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని, షుగర్ పేషెంట్లు వాటిని అస్సలు తినొద్దని చెబుతున్నారు. మరి ఏ పండ్లలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.. ఏ పండ్లలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి: మామిడి పళ్లంటే దాదాపు అందరూ అమితంగా ఇష్టపుతారు. మీడియం సైజు మామిడి పండులో 45 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే.. ఎక్కువగా మామిడి పండ్లను తినడం మానుకోవడం ఉత్తమం. ఒక రోజులో ఒకటి నుంచి రెండు మామిడి పండ్ల ముక్కలు తినొచ్చు.

ద్రాక్ష: ఒక కప్పు ద్రాక్ష పండ్లలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. సాధారణ పరిమాణంలో వీటిని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షా పండ్లను జ్యూస్‌, షేక్స్, వోట్ మీల్‌ ద్వారా తినవచ్చు.

చెర్రీస్: ఒక కప్పు చెర్రీస్‌లో 18 గ్రాముల చక్కెర ఉంటుంది. తద్వారా మీరు తిన్న పండ్లు తిన్నారో.. ఎంత షుగర్ ఆ పండ్లలో ఉంటుందో ఈజీగా అంచనా వేయొచ్చు. చెర్రీస్‌ను మితంగా తింటే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

పియర్: ఒక పియర్‌లో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు తక్కువ పరిమాణంలో తినాలనుకుంటే మొత్తం పండు కి బదులుగా.. కొన్ని ముక్కలు కట్ చేసుకుని తినొచ్చు. పియర్‌ను పెరుగు, సలాడ్‌లో వేసుకుని తినొచ్చు.

పుచ్చకాయ: ఒక మీడియం సైజ్ పుచ్చకాయలో 17 గ్రాముల చక్కెర ఉంటుంది. ఈ పుచ్చకాయలో అధిక శాతం నీరు, ఎలక్ట్రోలైట్ ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని రీఛార్జ్ చేయడానికి సహాయపడతాయి. ఒకేసారి రెండు పుచ్చకాయ ముక్కలు తినొచ్చు.

అరటి: అరటి పళ్లలో శక్తి సమృద్ధిగా ఉంటుంది. మీడియం సైజు అరటిలో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు ఉదయం అల్పాహారంలో ఈ అరటి పండును తినొచ్చు.

అవకాడో: ఒక అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర ఉంటుంది. మీరు దీనిని సలాడ్లు, టోస్ట్‌లలో కలిపి తినొచ్చు. ఈ పండ్లలో షుగర్ లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ అధిక కేలరీలు ఉంటాయి.

Also read:

Facebook: తాలిబన్ మిలిటెంట్‌ ముఠాపై తొలి వేటు.. దిమ్మతిరగే నిర్ణయం తీసుకున్న సోషల్ మీడియా దిగ్గజం

Viral Video: ఇదేం కర్మరా బాబు.! కారు దానంతట అదే లోయలో పడింది.. వీడియో చూస్తే షాకవుతారు.!

Congress Leader Rahul Gandhi: వయనాడ్ వయో వృద్దులతో కలిసి రాహుల్ గాంధీ సహపంక్తి భోజనం..