Facebook: తాలిబన్ మిలిటెంట్‌ ముఠాపై తొలి వేటు.. దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్న సోషల్ మీడియా దిగ్గజం

తాలిబన్.. ప్రపంచాన్ని ఆలోచింప చేస్తున్న పదం. ఆఫ్గన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అందలాన్ని అందుకుంది అరాచకం. తాము అనుకున్న రాజ్యాన్ని స్థాపించే దిశగా ముందుకెళ్తోంది మిలిటెంట్‌ ముఠా. అందుకే..

Facebook: తాలిబన్ మిలిటెంట్‌ ముఠాపై తొలి వేటు.. దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్న సోషల్ మీడియా దిగ్గజం
Facebook
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 17, 2021 | 6:40 PM

తాలిబన్.. ప్రపంచాన్ని ఆలోచింప చేస్తున్న పదం. ఆఫ్గన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అందలాన్ని అందుకుంది అరాచకం. తాము అనుకున్న రాజ్యాన్ని స్థాపించే దిశగా ముందుకెళ్తోంది మిలిటెంట్‌ ముఠా. అందుకే.. ప్రాణాలకు తెగించి పారిపోతున్నారు ఆఫ్గన్‌ ప్రజలు. అయితే ఇదంతా నిషితంగా పరిశీలిస్తోంది అంతర్జాతీయ సమాజం. ఇదిలావుంటే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తోపాటు పలు సామాజిక మాద్యమాలు ముందుగా రియాక్ట్ అయ్యాయి. ఇదే అంశంపై ఫేస్‌బుక్‌ ప్రతినిధి  (Facebook spokesperson) అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ANI (తాలిబాన్) ఒక ఉగ్రవాద సంస్థ (Terrorist organization) గా అంగీకరించబడింది. అందుకే ఫేస్‌బుక్ తన విధానాల ప్రకారం తాలిబాన్ సేవలను నిషేధించింది.

ఆఫ్ఘనిస్తాన్ అంతటా తాలిబాన్ల ఆక్రమణ మధ్య సామాజిక సంస్థ ఫేస్‌బుక్ ఈ సంస్థకు పెద్ద దెబ్బ కొట్టింది. ఫేస్‌బుక్ తన ప్లాట్‌ఫాం నుంచి తాలిబాన్‌లను పూర్తిగా నిషేధించింది. అమెరికా చట్టం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఫేస్ బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాబట్టి తాలిబాన్ కోసం ఫేస్బుక్ సేవను నిషేధించింది.

ఆ దేశంలోని ఎంట్రీ ఇవ్వడంతోనే తాలిబానీలు ఫేస్ బుక్‌లో ఖాతా తెరిచారు. వెంటనే వారికి సంబంధించిన సమాచాారం అందులో పోస్టులు పెడుతున్నారు. ఇది గమనించిన ఫేస్ బుక్.. వెంటనే తొలిగించడం మొదలు పెట్టింది. అంతే కాదు నిషేదం కూడా పెట్టింది. తాలిబాన్‌లను ప్రోత్సహించే కంటెంట్‌ను కూడా బ్రేక్ చేసింది ఫేస్‌బుక్.

ఫేస్‌బుక్ విధానాల ప్రకారం – టెర్రరిస్ట్ తంజీమ్‌కు ప్లాట్‌ఫారమ్‌లో చోటు ఇవ్వలేము అంటూ పేర్కొంది. దీంతో ఇక ముందు తాలిబాన్లకు లేదా వారికి సంబంధించిన ఏదైనా ఖాతా లేదా పోస్ట్‌కు ఫేస్‌బుక్‌లో కనిపించదు. తాలిబాన్లు నిర్వహిస్తున్న ఖాతాలు ఇప్పుడు తీసివేయబడుతున్నాయని ఫేస్బుక్ తెలిపింది.

ఫేస్‌బుక్ ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోసేరి బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ సంస్థ పేరు టెర్రరిస్టు జాబితాలో ఉన్నందున వారి గ్రూప్‌ని ప్రోత్సహించే లేదా ప్రాతినిధ్యం వహించే ఏదైనా కంటెంట్ నిషేధించబడిందని తెలిపారు.

ఫేస్‌బుక్ బాటలోనే ఇన్‌స్టాగ్రామ్..

ఫేస్ బుక్‌తోపాటు ఇన్‌స్టాగ్రామ్ కూడా తాలిబన్ సంబంధించిన సమాచారంను తొలిగించే పనిలో పడింది. మనం చేసే పనులను సవరించాలి. పెరుగుతున్న ఈ కష్టాలకు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నామో చూడాలి.

ఆదివారం కాబూల్‌ స్వాధీనం 

ఆఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే తాలిబన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజధాని కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఎన్జీవో సిబ్బంది.. భద్రతాసిబ్బంది, జర్నలిస్టులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. 80 మంది ఆఫ్గన్‌ పౌరులను అదుపు లోకి తీసుకున్నారు. దీంతో భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు కాబూల్‌ వాసులు. ప్రాణాలో పోయినా ఫర్వాలేదు.. తాలిబన్ల పాలన భరించలేం అంటే చాలామంది ఆఫ్గన్లు దేశం విడిచి పారిపోతున్నారు.

కాబూల్‌ ఎయిర్‌పోర్టులో భయంకరమైన వాతావరణం నెలకొంది. టీవీ 9 స్క్రీన్‌ మీద చూస్తున్న ఈ దృశ్యాలే అందుకు అద్దం పడుతున్నాయి. విమానాల్లో చోటు లేకపోవడంతో వాటి టైర్లు పట్టుకొని కొందరు ప్రయాణం చేసే ప్రయత్నం చేశారు .. కొద్దరు విమానం రెక్కలు పట్టుకొని ప్రయత్నం చేశారు. అదే వాళ్ల ప్రాణం మీదకు తెచ్చింది. కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం నుంచి ముగ్గురు కిందపడిపోయారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్లా పాపలతో పరుగులు పెడుతున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాలిబన్ల పాలన అంటే.. ఆఫ్ఘన్లు ఎంత బెదిరిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా దేశం విడిచిపెట్టివెళ్లాలి. అది ఎక్కడికైనా సరే. ఇక్కడ మాత్రం ఉండకూడదు. అదే..వారి లక్ష్యం..అందుకోసం ఏ ఫ్లైట్‌ కనిపిస్తే ఆ ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. విమానంలోకి ఎక్కేందుకు ఎగబడుతున్నారు.

ఇవి కూడా చదవండి: Postal Life Insurance: తక్కువ పెట్టబడితో ఎక్కువ భద్రత.. పోస్టాఫీసులో అదిరిపోయే ఇన్సూరెన్స్ ప్లాన్..

తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.

సూపర్ మార్కెట్లో ఒక్కమగాడిలా మార్టీ..! 50 మంది చేసే పని ఒక్కరే చేస్తే ఇదిగో ఇలా ఉంటుంది..:Marty Robot Video

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్