Hema Malini: ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో అసలేం జరుగుతోంది.? ఆవేదన వ్యక్తం చేసిన హేమామాలిని.

Afghanistan Crisis: ప్రస్తుతం ఓ వార్త పత్రిక చూసినా.. ఏ న్యూస్‌ ఛానల్‌ ట్యూన్‌ చేసినా ఆఫ్గనిస్థాన్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవడం..

Hema Malini: ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో అసలేం జరుగుతోంది.? ఆవేదన వ్యక్తం చేసిన హేమామాలిని.
Hema Malini
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 17, 2021 | 6:42 PM

Afghanistan Crisis: ప్రస్తుతం ఓ వార్త పత్రిక చూసినా.. ఏ న్యూస్‌ ఛానల్‌ ట్యూన్‌ చేసినా ఆఫ్గనిస్థాన్‌కు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు ఉపసంహరించుకోవడం..అక్కడ తాలిబాన్ ఆక్రమణతో ప్రపంచం దృష్టి మొత్తం ఇప్పుడు ఈ చిన్న దేశంపై పడింది. ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఆఫ్గన్‌ నుంచి పారిపోతున్న వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆఫ్గన్‌ ప్రజలు ఎలాంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వీరి పాలన ప్రపంచానికి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుందోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఇక ఆఫ్గన్‌ సంక్షోభంపై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మేమామాలిని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆఫ్గనిస్థాన్‌లో జరుగుతోన్న పరిణామాలపై తీవ్రంగా బాధపడిన హేమామాలిని ఆ దేశంతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హేమా నటించిన ‘ధర్మాత్మ’ అనే సినిమా ఆఫ్గనిస్థాన్‌లో షూటింగ్‌ జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఆఫ్గన్‌కు వెళ్లారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న ఈ సీనియర్‌ హీరోయిన్‌.. ధర్మాత్మా సినిమా పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘ఒకప్పుడు ఎంతో సంతోషంగా, శాంతియుతంగా ఉన్న ఆఫ్గనిస్థాన్‌లో అసలేం జరుగుతోంది. ఇది నిజంగా ఎంతో బాధకరమైన విషయం. ధర్మాత్మ చిత్ర షూటింగ్‌ సమయంలో ఆఫ్గన్‌లో నాకెన్నో గొప్ప జ్ఞాపకాలున్నాయి. ఈ సినిమాలో నా పాత్ర మొత్తం ఆ దేశంలోనే షూటింగ్‌ జరుపుకుంది. ఆ సమయంలో నా పేరెంట్స్‌ కూడా అక్కడే ఉన్నారు. సహ నటుడు ఫెరోజ్‌ ఖాన్‌ నా సంరక్షణ చూసుకున్నారు’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఆఫ్గనిస్థాన్‌లో షూటింగ్‌ జరుపుకున్న తొలి బాలీవుడ్‌ చిత్రంగా ధర్యాత్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు సమాచారం.

హేమ మాలిని చేసిన ట్వీట్..

Also Read: Rao Ramesh: ఏంటీ.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌కు ఇంత రెమ్యునరేషనా..? షాక్‌కు గురిచేస్తున్న రావు రమేష్‌ పారితోషకం వార్త.

Rana Venkatesh: వెబ్‌ సిరీస్‌లో సందడి చేయనున్న బాబాయ్‌, అబ్బాయ్‌.. ఆ హీరోయిన్‌ రీ ఎంట్రీ ఇందులోనేనా?

Prakash Raj: జిమ్‏లో మెగాస్టార్‏ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే