Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: జిమ్‏లో మెగాస్టార్‏ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల స్టార్ హీరో ధనుష్ సినిమా షూటింగ్‏లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భుజంపై గాయం కాగా.

Prakash Raj: జిమ్‏లో మెగాస్టార్‏ను కలిసిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికర ట్వీట్ చేసిన విలక్షణ నటుడు..
Prakash Raj
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 2:09 PM

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల స్టార్ హీరో ధనుష్ సినిమా షూటింగ్‏లో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన భుజంపై గాయం కాగా.. హైదరాబాద్‏లో సర్జరీ చేయించుకున్నారు. అయితే తన వ్యక్తిగత విషయాలను, మా అధ్యక్ష ఎన్నికల అంశాలపై ఎప్పటికప్పుడూ స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండే ప్రకాష్ రాజ్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో ఆసక్తికర ట్వీట్ చేశాడు. అన్నయ్య మాకు స్పూర్తి అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. చిరును కలిసిన ఫోటోను షేర్ చేశారు. అయితే ఇంత ఆకస్మాత్తుగా చిరంజీవి .. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‏ను కలవడం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‏గా మారింది.

చిరంజీవి-ప్రకాష్‌రాజ్‌ భేటీ ఇప్పుడు సినీ పరిశ్రమలో మరో చర్చకు దారి తీసింది. ఇండస్ట్రీకి అన్నయ్య ఓ వరం. పరిశ్రమ కష్టాలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య మాకు స్పూర్తి అంటూ చిరంజీవిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం పై చర్చనీయాంశమైంది. త్వరలో ఏపీ సీఎం జగన్‌తో భేటీ ఉన్న నేపథ్యంలో చిరంజీవి మొన్నీమధ్య తన నివాసంలో ఓ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్‌కి బడా ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌, యాక్టర్స్‌ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‏లో థియేటర్స్‌ ఓపెనింగ్‌, టికెట్ల ధరతోపాటు.. సినీ పరిశ్రమ ఇతర సమస్యలు అనేకం ఉన్నాయి కాబట్టి వాటిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

మొన్న జరిగిన ఈ మీటింగ్‌పైనే ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపించారు. ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి చేస్తున్న చిరు ప్రయత్నాలను మెచ్చుకున్నారు. షోల్డర్‌కు ట్రీట్‌మెంట్‌ తర్వాత అదే కట్టుతో చిరంజీవిని కలిసేందుకు చిరు ఇంటికి వెళ్లారు ప్రకాష్‌రాజ్‌. ఇదిలా ఉంటే… మరోవైపు మా ఎన్నికల్లో పోటీలో ఉన్న ప్రకాష్‌రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతుగా ఉన్నట్లుగా మొదటి నుంచి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు సైతం మీడియా ముందు ప్రస్తావించారు. ఓ వైపు మా ఎన్నికల్లో అభ్యర్థి కావడం, మరోవైపు ఇండస్ట్రీ సినిమా కష్టాలపై చిరంజీవి ఫోకస్‌ పెట్టడంపై ప్రశంసించడంతో టాలీవుడ్ ఈ మీటింగ్‌పై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల మా అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల చర్యలు తీసుకోవాలని మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్టం రాజుకు చిరు బహిరంగంగా లేఖ రాసిన సంగతి తెలిసిందే. అలాగే నటి హేమ చేసిన ఆరోపణలపై మా అధ్యక్షుడు నరేష్ ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ సంఘం నటి హేమకు నోటీసులు జారీ చేసింది.

Also Read: VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..

SR Kalyana Mandapam: ఓటీటీలోకి సూపర్ హిట్ ఎస్ఆర్.కళ్యాణ మండపం.. రిలీజ్ ఎప్పుడంటే..