VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..

కోలీవుడ్‏లో విషాదం చోటు చేసుకుంది. సన్ మ్యూజిక్ ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీజే ఆనంద కణ్ణన్ నిన్న రాత్రి కన్నుమూశారు.

VJ Anandha Kannan: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. పాపులర్ వీజే, నటుడు ఆనంద్ కణ్ణన్ కన్నుమూత..
Anandh Kannan
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 2:09 PM

కోలీవుడ్‏లో విషాదం చోటు చేసుకుంది. సన్ మ్యూజిక్ ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీజే ఆనంద కణ్ణన్ నిన్న రాత్రి కన్నుమూశారు. కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‏కు చికిత్స తీసుకుంటున్న కణ్ణన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆగస్ట్ 16న మరణించారు. ఈ విషయాన్ని తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సింగపూర్ తమిళియన్ అయిన ఆనంద 90వ దశకంలో కోలీవుడ్ ప్రేక్షకులకు ఫేవరెట్ నటుడు. సన్ టీవీ సిరీస్ సింధ్‏బాద్‏లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతను ఆకట్టుకున్నారు.

కొద్ది సంవత్సరాలుగా క్యాన్సర్‏తో పోరాడుతున్న ఆనంద్ కణ్ణన్ (48) చికిత్స తీసుకుంటునే పలు కార్యక్రమాల్లో నవ్వుతూ పాల్గొన్నారు. వారం క్రితం హఠాత్తుగా ఆరోగ్యం విషమించడంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆనంద్ కణ్ణన్ మృతితో తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆనంద్ కణ్ణన్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఏకేటీ థియేటర్స్‌ను ఏర్పాటుచేసి.. వర్క్‌షాప్స్‌తో రూరల్‌ కల్చర్‌ ద్వారా వర‍్ధమాన నటులెందరినో ప్రోత్సహించాడు. సింగపూర్‌లోని వసంతం టీవీలో వీజేగా కెరీర్ ఆరంభించిన ఆనంద కణ్ణన్ ఆ తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్ మ్యూజిక్ ప్రారంభించిన తర్వాత ఛానెల్‌లో సీరియల్స్ చేశారు.. ఆనంద కణ్ణన్ సన్ మ్యూజిక్ విజార్డ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. 2012లో అతిశయ ఉలగం 3 డి సినిమాతో ఆనంద కణ్ణన్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రం తరువాత ఆనంద్ కణ్ణన్ ముల్లుమ్ మలరుమ్‏లో విజే ప్రజన్‌తో కలిసి నటించారు. కానీ ఆ సినిమా తెరపైకి రాలేదు. ఆ తర్వాత సినిమా విడుదల కాలేదు. ఆనంద్ కణ్ణన్, దర్శకుడు వెంకట్ ప్రభుకి మంచి స్నేహితుడు. అతను దర్శకత్వం వహించిన సరోజా చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.

ట్వీట్..

Also Read: Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపమే.. ఎలా అధిగమించాలంటే..

Telangana Intermediate Board: గుడ్‌న్యూస్.. ఇంటర్ ప్రవేశాల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

నాచారంలో దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా హతమార్చిన దంపతులు.. ఆ తర్వాత ఏం చేశారంటే..?