Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపమే.. ఎలా అధిగమించాలంటే..

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని చెప్పుకోవచ్చు

Iron Deficiency: ఈ లక్షణాలు ఉంటే ఐరన్ లోపమే.. ఎలా అధిగమించాలంటే..
Iron Deficiency
Follow us

|

Updated on: Aug 17, 2021 | 9:39 AM

సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు, చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులు అని చెప్పుకోవచ్చు. బలహీనంగా ఉండడం, శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత , హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వలన జుట్టు రాలడం.. నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఐరన్ లోపం వలన కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఎక్కువగా స్త్రీలు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. అలాగే ఐరన్ లోపం వలన జుట్టు, చర్మంపై అనేక ప్రభావాలు చూపిస్తుంది. అయితే ఐరన్ లోపాన్ని కొన్ని లక్షణాలను గుర్తించవచ్చు. అవెంటో తెలుసుకుందామా.

1. శరీరంలో ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ చర్మ కణాలకు చేరదు. దీంతో కళ్ల చుట్టూ చర్మం, నల్లగా మారడం వంటి సమస్యలు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. 2. ఐరన్ లోపం వలన చర్మంపై తామర వంటి సమస్యలు కలుగుతాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వలన చర్మం కాంతి తగ్గి.. పాలిపోయినట్లుగా ఉంటుంది. ఐరన్ లేకపోవడం వలన చర్మం పొడిగా మారుతుంది.. దద్దర్ల సమస్యలు కలుగుతాయి. 3. ఐరన్ లోపం వలన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఐరన్ వలన జుట్టు పెరుగుదల జరుగుతుంది. ఐరన్ లోపం వలన జుట్టు నిర్జీవంగా మారడం, ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది.

ఐరన్ లోపాన్ని ఎలా అధిగమించాలి ? బలహీనంగా అనిపించడం, అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మ సమస్యలు, నిద్రమలేమి, ఒత్తిడి, కంగారు, కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. డాక్టర్ సలహాలతో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అలాగే ఆహారంలో వీలైనంత వరకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు, కాయ ధాన్యాలు, బీన్స్, పాలకూర, తృణధాన్యాలు వంటి పదార్థాలను తీసుకోవాలి.

తీసుకోవాల్సిన పదార్థాలు.. 

1. శరీరంలో రక్తం మొత్తాన్ని పెంచడానికి బీట్‌రూట్ సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. 2. రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు అంటారు. నిజమే ఆపిల్ తినడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరంలో రక్తాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. 3. దానిమ్మలో కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దానిమ్మ శరీరంలో రక్తాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుంది. 4. ఖర్జూరం, వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన ఎర్ర రక్త కణాలు రక్తంలో వేగంగా పెరుగుతాయి. 5. మీ శరీరంలో రక్తం లోపం ఉన్నవారు…బచ్చలికూరను తీసుకోవడం మంచిది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Walking Benefits: రోజూ అరగంట నడవడం వలన వృద్ధాప్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. నడకతో ప్రయోజనాలు బోలేడు..

Guava Side Effects: జామలో పోషకాలు మెండు.. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పండుని తినకూడదో తెలుసా

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు