Guava Side Effects: జామలో పోషకాలు మెండు.. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పండుని తినకూడదో తెలుసా

Guava Side Effects: ప్రకృతి లో మానవుడు కూడా ఓ భాగమే.. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉన్నది.. అందుకనే మనిషికి ఉపయోగపడే విధంగా మొక్కలు, జంతువులు ఎన్నో..

Guava Side Effects: జామలో పోషకాలు మెండు.. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఈ పండుని తినకూడదో తెలుసా
Guava Side Effects
Follow us
Surya Kala

|

Updated on: Aug 17, 2021 | 8:39 AM

Guava Side Effects: ప్రకృతి లో మానవుడు కూడా ఓ భాగమే.. మనిషికి ప్రకృతికి విడదీయరాని బంధం ఉన్నది.. అందుకనే మనిషికి ఉపయోగపడే విధంగా మొక్కలు, జంతువులు ఎన్నో జన్మించాయి. మన ఆరోగ్యానికి మొక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక పేదవాడి యాపిల్ గా పిలుచుకొనే జామకాయ తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇండియన్ ఆపిల్ రుచికరమైన పోషకాల పండు. అయితే ఈ జామకాయను జామ్ లా తయారు చేసుకోవచ్చు. లేదా అలాగే పండు తీసుకోవచ్చు, ఇక జామాకులు కూడా ఆరోగ్యానికి మంచివి. ఈ జామకాయ తినడంవలన గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని ఇస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పేదవారి యాపిల్ లో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నా అయితే ఇవి అందరికీ మంచివి కావట. అంతేకాదు ప్రత్యేకించి కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ పండుని తినకుండా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.

ఎలాంటి శారీరక సమస్య ఉన్నవారు జామకాయను తినకూడదో చూద్దాం..

జామకాయలో విటమిన్ సి, ఫ్రక్టోజ్ లు అధికంగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదైనా శరీరంలో అధికమైతే.. శరీరంవాపు కి గురవుతుంది. ఎందుకంటే విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్ కనుక మన శరీరానికి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు.. అంతేకాదు జామకాయ ఎక్కువగా తింటే కడుపులో మంటవస్తుంది. 40 శాతం మంది ప్రజలు ఫ్రక్టోజ్ లోపంతో బాధపడుతుంటారు. జామకాయలోని సహజ చక్కెర కొంతమంది శరీరతత్వానికి సరిపోదు. అందుకనే జామకాయ కొన్నిసార్లు కడుపులో మంటకు దారితీస్తుంది. ముఖ్యంగా జామపండు తిన్న వెంటనే నిద్రపోవడం కూడా కడుపులో మంటను కలిగించవచ్చు.

పేగు వ్యాధి ఉన్న వారు జామకాయని తినకపోవడం మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్దకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ అధిక మోతాదులో జామ తింటే అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. జీర్ణక్రియను గందరగోళానికి గురి చేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతున్నవారు జామకాయను తక్కువగా తినడం మంచిది.

నిజానికి షుగర్ పేషేంట్స్ కు జామకాయ మంది ఆహారం.. అయితే మధుమేహ వ్యాధి గ్రస్తులు ఆహారంలో జామకాయని చేర్చుకుంటే, అటువంటి వారి రక్తంలో చక్కెర స్థాయిని నిరంతరం పర్యవేక్షించాలి. 100 గ్రాముల తరిగిన జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. అందువల్ల, అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న మధుమేహ వ్యాధిగ్రస్తులు జామకాయను మితంగా తినడం మంచిది.

జామకాయను ఆరోగ్యానికి మంచిది.. దీనిని తినడం సురక్షితం. అయితే ఈ పండుని రోజూ ఎక్కువగా తినకూడదు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. మీ శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొంత విరామం తర్వాత తింటే మంచిది. అంతేకాదు ఎవరైనా క్రీడాకారులకు శిక్షణకు ముందు పండ్లు తినవచ్చు. కానీ రాత్రి సమయంలో జామపండు తినడం మంచిది కాదు.. అలా రాత్రి సమయంలో జామపండుని తింటే జలుబు, దగ్గుబారిన పడే అవకాశం ఉంది.

Also Read:  పెద్దలు బ్రాహ్మీముహర్తంలో నిద్రలేవమని చెబుతారు ఎందుకో తెలుసా.. అలా నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు ఎన్న