AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF Withdrawal: మీరు తరచూ పీఎఫ్‌ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే రూ.35 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం.. ఎలాగంటే

PF Withdrawal: పీఎఫ్‌ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా నుంచి తరచుగా డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా పీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేస్తే.. పదవీ..

PF Withdrawal: మీరు తరచూ పీఎఫ్‌ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే రూ.35 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం.. ఎలాగంటే
Pf Withdrawal
Subhash Goud
|

Updated on: Aug 17, 2021 | 8:55 AM

Share

PF Withdrawal: పీఎఫ్‌ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా నుంచి తరచుగా డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా పీఎఫ్‌ డబ్బులను విత్‌డ్రా చేస్తే.. పదవీ విరమణ సమయంలో భారీగా నష్టపోతారట. సుమారు 35 లక్షల రూపాయల వరకు కోల్పోతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌ఓ) ప్రకారం.. కరోనా మహమ్మారి కాలంలో చాలామంది అభ్యర్థులు తన పీఎఫ్‌ డబ్బులను భారీగా విత్‌ డ్రా చేసుకున్నారు. సుమారు 7.1 మిలియన్ల కన్నా ఎక్కువ పీఎఫ్‌ అకౌంట్లు క్లోస్‌ అయ్యాయి. దీనిపట్ల ఈపీఎఫ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యవసరం అయితే తప్ప పీఎఫ్‌ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో డ్రా చేయసుకోవద్దని సూచిస్తోంది.

కారణం ఏంటంటే..

అయితే పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం వల్ల నష్టపోతారని విషయమై పెద్దగా అవగాహన లేకపోయినా.. కొందరికి అవగాహన ఉన్నా.. డ్రా చేస్తూనే ఉంటారు. అలాంటి వారు నష్టపోవాల్సి వస్తుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ అకౌంట్‌ మీద 8.5 శాతం వడ్డీ వస్తుంది. చిన్నమొత్తాల మీద ఇచ్చే వడ్డీతో పోల్చితే ఇదే అత్యధికం. 8.5 వడ్డీ లభిస్తుండటంతో చాలా మంది జనాలు తమ వాలంటరీ రిటైర్మెంట్‌ డబ్బులను ఈపీఎఫ్‌ అకౌంట్‌లోనే పొదుపు చేస్తున్నారు. ఈ ఖాతాలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే.. అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

ఉదాహరణకు.. మీకు ఇప్పుడు 30 ఏళ్లు ఉన్నాయనుకొండి.. మరో 30 ఏళ్లు ఉద్యోగంలో ఉంటారు. ఈ క్రమంలో మీరు పీఎఫ్‌ అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలు విత్‌ డ్రా చేశారనుకుందాం. అది మీ పదవీ విమరణ సమయంలో లభించే మొత్తం మీద భారీ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రా చేసే 1 లక్ష రూపాయలు.. ఈపీఎఫ్‌ కాలుక్యులేటర్‌ ప్రకారం చూస్తే.. ఈ మొత్తం పదవీ విమరణ కాలానికి 11.55 లక్షలతో సమానంగా ఉంటుందని ఈపీఎఫ్‌ఓ మాజీ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఏకే శుక్లా వెల్లడిస్తున్నారు. ఇక మీరు పీఎఫ్‌ ఖాతా నుంచి మధ్యమధ్యలో సుమారు 3 లక్షల రూపాయలు డ్రా చేశారనుకొండి.. ఇది మీ పదవీ విరమణ సమయంలో లభించే మొత్తంలో భారీ కోతకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన పదవీవిరమణ సమయంలో మీరు 35 లక్షల రూపాయల వరకు కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. వీలైనంత తక్కువ సార్లు డ్రా చేస్తే మంచిదంటున్నారు.

అలాగే మీకు పదవి విమరణ సమయంలో 20 సంవత్సరాలు ఉంటే.. మీరు 50 వేల రూపాయలు విత్‌డ్రా చేస్తే మీకు 2 లక్షల 5 వేల రూపాయల వరకు నష్టం వస్తుంది. అదే విధంగా 1 లక్ష రూపాయలపై 5 లక్షల 11 వేల రూపాయలు నష్టం వస్తుంది. ఇక 2 లక్షల రూపాయలపై 10 లక్షల 22వేల రూపాయలు, 3 లక్షల రూపాయల మీద 15 లక్షల 33 వేల రూపాయలు నష్టం వస్తుంది. మీ పదవి విరమణ సమయానికి 30 సంవత్సరాలు ఉండి 50 వేల రూపాయలు విత్‌డ్రా చేస్తే 5 లక్షల 27 వేల రూపాయలు నష్టం వస్తుంది. అదే సమయంలో 1 లక్ష రూపాయలపై 11 లక్షల 55వేల రూపాయలు నష్టం, 2 లక్షల రూపాయలపై 23 లక్షల 11 వేల రూపాయలు, 3 లక్షల రూపాయలపై 34 లక్షల 67 వేల రూపాయలు నష్టం వస్తుంది.

ఇక ప్రావిడెంట్‌ ఫండ్‌ నుంచి ఉపసంహరణ నియమాల గురించి ఆయన మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాల సర్వీస్‌ తర్వాత వివాహం, లేదా పిల్లల వివాహం కోసం గరిష్టంగా 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. ఇది ఉద్యోగుల వాటాలో 50 శాతం ఉంటుంది. ఇతర వాటి కోసం కూడా 50 శాతం వరకు డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఇల్లు నిర్మించడానికి లేదా భూమిని కొనుగోలు చేయడానికి ఐదు సంవత్సరాలు పని చేసిన తర్వాత ఈ ఫండ్‌ నుంచి డబ్బులను ఉపసంహరించుకోవచ్చు. ఈ మొత్తం నెలవారీ వేతనం, డియర్‌నెస్‌ భత్యం కంటే 24 రెట్లు ఉండవచ్చు. గృహ రుణ చెల్లింపులో 90 శాతం వరకు ఉద్యోగి వాటాను ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం 10 సంవత్సరాల సర్వీస్‌ అవసరం. ఇంటి పునర్‌నిర్మాణానికి నెలవారీ వేతనానికి 12 రెట్లు ఉపసంహరించుకోవచ్చు. దీని కోసం కనీసం 5 సంవత్సరాల సర్వీసు తప్పనిసరి అవసరం.

అలాగే వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆరు నెలల ప్రాథమిక నెలవారీ వేతనం, డియర్‌నెస్‌ అలవెన్స్‌ ఉపసంహరించుకోవచ్చు. ఇది ఉద్యోగుల వాటా నుంచి ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగం పోయినట్లయితే మొత్తం కార్పస్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేయవచ్చు. 57 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పదవి విమరణ, ఉద్యోగం కోల్పోయినట్లయినా ఫండ్‌ నుంచి 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి: Taxpayers: పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. త్వరలో కొత్త ఐటీ పోర్టల్‌.. ఇన్ఫోసిస్‌తో చర్చలు: కేంద్ర మంత్రి

Fuel Prices: సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు తగ్గుతాయా? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..