LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు

LPG: దేశంలో ప్రతి ఒక్కరు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోకుండా వంట గ్యాస్ సిలిండర్‌ కలిగి ఉండేలా మోదీ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రత్యేకించి పర్ధాన మంత్రి..

LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు
How to Open New LPG Gas Agency
Follow us
Subhash Goud

|

Updated on: Aug 17, 2021 | 10:51 AM

LPG: దేశంలో ప్రతి ఒక్కరు కూడా కట్టెల పొయ్యి మీద వంట చేసుకోకుండా వంట గ్యాస్ సిలిండర్‌ కలిగి ఉండేలా మోదీ సర్కార్‌ చర్యలు చేపడుతోంది. ఇందుకు ప్రత్యేకించి పర్ధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా దేశంలోని కోట్లాది పేద కుటుంబాలు కూడా ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్‌ కలిగి ఉన్నాయి. దేశంలో కోట్లాది మంది గ్యాస్‌ కనెక్షన్‌ పొందడం వల్ల ఇప్పుడు గ్యాస్‌ సిలిండర్ల వినియోగం కూడా పెరిగిపోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఉజ్వల యోజన 2.0ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1 కోటి కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ గ్యాస్‌ సిలిండర్లు అవసరం అవుతాయి. ఇప్పటికే పని చేస్తున్న గ్యాస్ ఏజెన్సీలపై భారం కూడా పెరుగుతుంది. దీని కారణంగా కొత్త గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎంతో అవసరం.

అటువంటి పరిస్థితిలో గ్యాస్‌ ఏజెన్సీని ప్రారంభించడం వల్ల మంచి వ్యాపారమనే చెప్పాలి. చాలా మంది గ్యాస్‌ ఏజెన్సీని తెరవాలనుకుంటున్నారు. కానీ చాలా మందికి ఏజెన్సీ విషయం గురించి పెద్దగా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గ్యాస్‌ ఏజెన్సీని పొందవచ్చు. మరి గ్యాస్‌ ఏజెన్సీని నడపాలంటే ఎలాంటి నియమ నిబంధనలు, అర్హతలు ఏమిటో చూద్దాం.

గ్యాస్ ఏజెన్సీకి అర్హతలు:

1. ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌ షిప్‌ కావాలనుకునేవారు భారతీయుడై ఉండాలి. 2. కనీసం 10వ తరగతి పాసై ఉండాలి. 3. వయసు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. 4) మీ కుటుంబ సభ్యులు ఎవరూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో పని చేయకూడదు. 5) గ్యాస్‌ సిలిండర్‌ల నిల్వ కోసం మీకు అతిపెద్ధ గోడౌన్‌ ఉండాలి. 6) దీంతో పాటు మీ కార్యాలయానికి స్థలం కూడా ఉండాల్సి ఉంటుంది.

దేశంలో మూడు ప్రభుత్వ ఎల్‌పీజీ కంపెనీలు ఉన్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిడెట్‌ ఇండేన్‌ గ్యాస్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం (HP) గ్యాస్‌ కోసం పంపిణీదారులను అందిస్తుంది ప్రభుత్వం. వీటికి డిస్ట్రిబ్యూటర్‌ షిప్‌ను ఇస్తాయి. కొత్త పంపిణీదారులను సృష్టించడానికి మూడు కంపెనీలు ఎప్పటికప్పుడు దరఖాస్తులను ఆహ్వానిస్తాయి.

దరఖాస్తు తర్వాత ఇంటర్వ్యూ, ధృవీకరణ తప్పనిసరి:

కంపెనీలు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తాయి. దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థిని షెడ్యూల్‌ చేసిన తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు అన్ని అర్హతలు కలిగి ఉన్న తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను విడుదల చేస్తాయి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మెరిట్‌ జాబితాలో పేరు ఉన్న తర్వాత ఎల్‌పీజీ కంపెనీ ప్యానెల్‌ దరఖాస్తులోని నమోదు చేసిన వివరాలపై ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ నిర్వహిస్తాయి ఆయా గ్యాస్‌ కంపెనీలు. ఇందులో భూమి, గిడ్డంగి మొదలైన వాటిని పరిశీలిస్తాయి. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారునికి ప్రాంతం ప్రకారం గ్యాస్‌ ఏజెన్సీని కేటాయించబడుతుంది. అలాగే అభ్యర్థి గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడానికి కాలపరిమితి ఇవ్వబడుతుంది. అంతలోపు అతను పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా గ్యాస్ కంపెనీలు ఎప్పటికప్పుడు గ్యాస్‌ ఏజెన్సీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంటాయి. దీని కోసం ఆ కంపెనీల వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండాలి. మరింత సమాచారం కోసం, మీరు ఈ వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

వీరికి ప్రాధాన్యత:

గ్యాస్‌ ఏజెన్సీ కోసం ప్రభుత్వం నిర్ధేశించిన నియమ నిబంధనల ప్రకారం.. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 50శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. నిబంధనల ప్రకారం.. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వ్యక్తులకు రిజర్వేషన్‌ ఉంటుంది. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికులు, సాయుధ దళాలు, పోలీసు సేవ, జాతీయ క్రీడాకారులు, సామాజిక వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తారు.

గ్యాస్ ఏజెన్సీ లేదా డీలర్‌షిప్ తీసుకోవడానికి శాశ్వత చిరునామా అత్యంత ముఖ్యమైన పరిస్థితి. ఇది కాకుండా, మీరు ధృవీకరణకు ముందు ఆఫీసు స్థలం మరియు గ్యాస్ ఏజెన్సీ కోసం గిడ్డంగి కోసం తగినంత భూమి లేదా స్థలాన్ని సిద్ధం చేయాలి. కంపెనీలు తీసుకున్న ప్రకటనలో, ఏ గ్రామం, ప్రాంతం, వార్డు లేదా స్థలానికి భూమి ఉండాలి అనే వివరాలు ఇందులో ఉన్నాయి.

ఇది కాకుండా, కంపెనీ స్టాండర్డ్ ప్రకారం.. మీరు డిపాజిట్‌ మొత్తం, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. మీ బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల స్టేట్‌మెంట్‌లను పరిశీలిస్తారు. దీంతో పాటు, మీరు సిలిండర్లను డెలివరీ చేసేందుకు తగినంత సిబ్బంది కలిగి ఉండాలి. కంపెనీ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.

ఇవీ కూడా చదవండి:  PF Withdrawal: మీరు తరచూ పీఎఫ్‌ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే రూ.35 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం.. ఎలాగంటే

Fuel Prices: సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు తగ్గుతాయా? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!