AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol-Diesel Price Today: దేశంలో తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.!

Petrol-Diesel Price Today: గత కొన్ని రోజులుగా దేశీయంగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రేట్లు పెరగకపోయినా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు..

Petrol-Diesel Price Today: దేశంలో తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.!
Subhash Goud
|

Updated on: Aug 17, 2021 | 11:28 AM

Share

Petrol-Diesel Price Today: గత కొన్ని రోజులుగా దేశీయంగా పెట్రోల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా రేట్లు పెరగకపోయినా.. ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారింది. లీటర్‌ పెట్రోల్‌ ధర సెంచరీ దాటిపోవడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఇక వరుసగా 31 వ రోజు కూడా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే దేశీయంగా ధరలు ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయా..? అనే విషయమై సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ క్లారిటీ ఇచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు యోచన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్‌ సుంకాలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరాయన్న విమర్శల నేపథ్యంలో ఆర్థికమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

తాజాగా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి:

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 ఉండగా, డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.98.22గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.22 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.77గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.89 ఉండగా,. డీజిల్ ధర రూ. 98.51గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.99.48గా ఉంది.

ఇవీ కూడా చదవండి

LPG: ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీ పొందడం ఎలా?.. గ్యాస్‌ సిలిండర్‌ డీలప్‌షిప్‌ కావాలంటే ఏం చేయాలి.. పూర్తి వివరాలు

PF Withdrawal: మీరు తరచూ పీఎఫ్‌ డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే రూ.35 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం.. ఎలాగంటే

Follow Us
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?