శ్రీలీల,కార్తిక్ ఆర్యన్ డేటింగ్.. కోడలిగా డాక్టర్ అమ్మాయి రావాలంటున్న హీరో తల్లి!
బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, నటి శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రోజుల నుంచి బీటౌన్‌లో ప్రచారం జరుగుతుంది. కార్తిక్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే తమ ఇంటికి ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో తెలియజేస్తూ కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఐఫా’ వేడుకల్లో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్‌జోహార్ కాబోయే కోడలి గురించి ప్రశ్నించారు.
‘‘ఒక మంచి వైద్యురాలు మా ఇంటికి కోడలిగా రావాలని మేమంతా కోరుకుంటున్నాం’’ అని ఆమె తెలిపారు. దాంతో శ్రీలీలను వివాహం చేసుకోబోతున్నట్లు కార్తిక్ ఆర్యన్ తన తల్లికి కన్ఫమ్‌గా చెప్పాడా అన్న టాక్ నడుస్తోంది. నటిగా రాణిస్తోన్న శ్రీలీల.. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. చదువుతో పాటే కెరీర్‌లోనూ కొనసాగడంపై ఎన్నో సందర్భాల్లో ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కార్తిక్ – శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోన్న వేళ హీరో తల్లి వ్యాఖ్యలు వాటికి మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. శ్రీలీలను ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు భావిస్తున్నారు. దక్షిణాదిలో హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్న శ్రీలీల.. బాలీవుడ్‌లో తన సత్తా చాటుకునేందుకు రెడీ అయింది. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తుంది. ఆ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే కార్తిక్ – శ్రీలీల మధ్య పరిచయం ఏర్పడిందని.. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది మాత్రం వాళ్లది కేవలం స్నేహం మాత్రమేనని.. ఆ స్నేహంతోనే ఆమెను ఆయన ఇంటికి ఆహ్వానించారని అని మాట్లాడుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ డేటింగ్ కథనాలపై నటీనటులు ఎక్కడా స్పందించలేదు.
మరిన్ని వీడియోల కోసం :
ఐస్‌క్రీమ్‌లో పాము పిల్ల.. వణుకు పుట్టిస్తున్న వీడియో
ఇదికదా టెక్నాలజీ అంటే.. అతని తెలివికి హ్యాట్సాఫ్ వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

