- Telugu News Photo Gallery Business photos These are cool breezes even in the scorching summers at home, Learn about the best air coolers in the market, Air coolers details in telugu
Air coolers: మండు వేసవిలోనూ కూల్..కూల్.. మార్కెట్‌లో ది బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఇవే..!
వేసవి కాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఉక్కబోతతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లలో చల్లదనం కోసం ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లోకి అనేక రకాల కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. గది ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇంటితో పాటు కార్యాలయాల్లోనూ వీటిని చక్కగా వినియోగించుకోవచ్చు. క్రాంప్టన్, బజాజ్, సిఫనీ తదితర అగ్రశ్రేణి బాండ్ల నుంచి విడుదలైన కూలర్లు, వాటి ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం.
Srinu |
Updated on: Mar 18, 2025 | 3:45 PM

సింఫనీ స్మార్ట్ డెజర్ట్ ఎయిర్ కూలర్ 70 లీటర్ల ట్యాంక్ , లెవెల్ ఇండికేటర్ తో అందుబాటులోకి వచ్చింది. 14 కిలోల బరువైన ఈ కూలర్ శబ్ధస్థాయి 50 డీబీ మాత్రమే. దుమ్ము, అలర్జీ కణాలను తొలగించడానికి దీనిలో దశల వారీ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. దీనిలోని ఫ్యాడ్ లు ఎక్కువ సేపు నీటిని నిలుపుకొంటాయి. ఎస్ఎంపీఎస్ టెక్నాలజీ కారణంగా వోల్టేజ్ హెచ్చు తగ్గుదలను నియంత్రణ చేసుకోవచ్చు. వేగంగా నలువైపులా వీచే గాలితో గది త్వరగా చల్లబడుతుంది.

ప్రముఖ ఎయిర్ కూలర్ల తయారీ సంస్థ అయిన క్రాంఫ్టన్ నుంచి విడుదలైన ఓజోన్ డెజర్ట్ కూలర్ 75 లీటర్ల ట్యాంకు, ప్రత్యేక ఐస్ చాంబర్ తో ఆకట్టుకుంటోంది. నలువైపులా గాలి వీచేలా మోటరైజ్డ్, ఆటో లెవెల్ ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఇన్వర్టర్ అనుకూలత, మన్నిక కోసం టాప్ నాచ్ ఏబీఎస్ ప్లాస్టిక్ బాడీ, పోర్టబిలిటీ కోసం 360 డిగ్రీల కాస్టర్ వీల్స్, ఎవర్ లాస్ట్ పంప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఇన్వర్టర్ కారణంగా విద్యుత్ లేనప్పుడు కూడా చల్లని గాలి ని ఆస్వాదించవచ్చు. వేసవి కాలంలో కొనుగోలు చేయదగిన బెస్ట్ కూలర్లలో ఇది ఒకటి. దీని బరువు 14.5 కిలోలు, శబ్ద స్థాయి 38 డీబీ మాత్రమే.

డ్యురామెరైన్ పంప్ తో కూడిన బజాజ్ ఎయిర్ కూలర్ 90 లీటర్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంది. ఐస్ క్యూబ్ లను నిల్వ చేయడానికి దీనిలో ప్రత్యేక ఐస్ చాంబర్లు ఉన్నాయి. మూడు వైపులా ఉండే ప్యాడ్ ల నుంచి అన్ని వైపులా చల్లని గాలి వీస్తుంది. టర్బో ఫ్యాన్ టెక్నాలజీ తో మూడు రకాల స్పీడ్ కంట్రోల్ ఎంపికలతో లభిస్తుంది. మెరుగైన పోర్టబిలిటీ కోసం కాస్టర్ వీల్స్ అమర్చారు. సుమారు 18 కిలోల బరువైన ఈ కూలర్ ట్యాంక్ సామర్థ్యం 85 లీటర్లు.

శక్తివంతమైన మోటారు, బలమైన గాలిని వీయగల భాబర్లీ బర్లీ కూలర్ ప్రో డ్రెజర్ట్ కూలర్ 75 లీటర్ల వాటర్ ట్యాంకుతో లభిస్తుంది. మూడు రకాల సెట్టింగ్ లతో, వేగంగా వీచే గాలితొో గదిని మొత్తం చల్లబరుస్తుంది. నీటిని ఎక్కువ సేపు నిలుపుకోగల హనీకోంబ్ ప్యాడ్ లు, ఇన్వర్టర్ అనుకూలత, 4 వే ఎయిర్ డిఫెక్షన్ , మెరుగైన శీతలీకరణ కోసం ప్రత్యేక ఐస్ చాంబర్లు దీని ప్రత్యేకతలు. ఇంటిలో ఉపయోగించుకునేందుకు చాలా వీలుగా ఉంటుంది.

నోవామాక్స్ రాంబో జూనియర్ 75 లీటర్ల ఎయిర్ కూలర్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. గాలి వేగం నియంత్రణ కోసం మూడు రకాల సెట్టింగ్ లు, దోమతెర, దుమ్ము ఫిల్టర్ బాగున్నాయి. వేగంగా వీచే చల్లని గాలి, నీటిని ఎక్కువ సేపు నిలుపుకోగల యాంటీ బయాటిక్ ఇన్ఫ్యూజ్డ్ హనీకాంబ్ ప్యాడ్ లు, ఇన్వర్టర్ అనుకూలత, షాక్ ఫ్రూప్ ఆకట్టుకుంటున్నాయి. రూ.15 వేల కంటే తక్కువ ధరకు లభించే ఎయిర్ కూలర్లలో ఇది ఒకటి.





























