PM Modi: ప్రధాని మోదీతో అమెరికా డీఎన్‌ఐ తులసీ గబ్బర్డ్ భేటీ..
ప్రధాని మోదీతో అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అధికారులు భేటీ అయ్యారు. భారత్‌లో రెండున్నర రోజుల పర్యటనకు తులసీ న్యూదిల్లీకి వచ్చారు. ఆమె గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్‌లో కూడా పాల్గొన్నారు. ఆదివారం అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సులో పాల్గొనడానికి తులసీ భారత్‌కు వచ్చారు.
ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునే దిశగా భారతదేశం, అమెరికా దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడంపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌తో సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడంపై దృష్టి సారించింది.
ఈ సందర్భంగా మహాకుంభ్ సమయంలో సేకరించిన పవిత్ర జలాన్ని ప్రధాని మోదీ తులసి గబ్బర్డ్‌కు బహూకరించారు. డోనాల్డ్ ట్రంప్ రెండోవిడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి తొలిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. తులసి గబ్బర్డ్ తన రెండున్నర రోజుల పర్యటన కోసం ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌ను కలిసిన తులసి, సోమవారం ఉదయం ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ల సమావేశంలో పాల్గొన్న తర్వాత రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు.
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

