AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SR Kalyana Mandapam: ఓటీటీలోకి సూపర్ హిట్ ఎస్ఆర్.కళ్యాణ మండపం.. రిలీజ్ ఎప్పుడంటే..

కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్లలో మళ్లీ కాసుల వర్షం కురిపించిన సినిమా ఎస్ఆర్. కళ్యామ మండపం.

SR Kalyana Mandapam: ఓటీటీలోకి సూపర్ హిట్ ఎస్ఆర్.కళ్యాణ మండపం.. రిలీజ్ ఎప్పుడంటే..
Sr Kalyana Mandapam
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 17, 2021 | 2:10 PM

Share

కరోనా సెకండ్ వేవ్ అనంతరం తెరుచుకున్న థియేటర్లలో మళ్లీ కాసుల వర్షం కురిపించిన సినిమా ఎస్ఆర్. కళ్యామ మండపం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోవిడ్ భయంతో థియేటర్లు రావడానికి ఆసక్తి చూపని ప్రేక్షకులకు తిరిగి థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేశాడు కిరణ్ అబ్బవరం. అటు ఓటీటీ ఫ్లాట్‏ఫామ్స్‏ సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్న తరుణంలో ఈ సినిమా థియేటర్లకు పూర్వ వైభవం తీసుకువచ్చింది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్‏గా నిలిచింది. రాజవారు రాణివారు సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం ఖాతాలో ఎస్ఆర్. కళ్యాణ మండపం భారీ సక్సెస్ ఇచ్చింది. ఇందులో కిరణ్ సరసన ప్రియాంక జవాల్కర్ నటించింది. ప్రమోద్ – రాజ్ నిర్మించిన ఈ సినిమాకి శ్రీధర్ దర్శకత్వం వహించాడు. సీనియర్ నటుడు సాయికుమార్ – తులసి కీలకమైన పాత్రలను పోషించారు.

విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించింది కూడా కిరణ్ అబ్బవరమే. ఈ సినిమాలోని నటీనటులు అందరూ తమ నటనతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఎంటర్‏టైన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న డిమాండ్‏ను మంచి బడ్జెట్ ఇచ్చి కొనుగోలు చేసినట్లుగా టాక్. ఆగస్ట్ 27న ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమాను స్ట్రీమ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంద. ఈ సినిమా విడుదలైన దాదాపు మూడు వారాల తర్వాత ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా తెలుసా్తోంది. మొత్తానికి రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఎస్ఆర్. కళ్యాణ మండపం సినిమా మరోసారి ఓటీటీ వేదికగా ఆడియన్స్‏ను ఎంటర్‏టైన్ చేయనుంది. చూడాలి.. ఓటీటీలో ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Also Read: Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ మీదికి ఎగబడ్డ జనాలు.. ఊకో కాకా అన్న ఊరుకోలేదు.. అసలేమైందంటే.

Adah Sharma: మల్టీ టాలెంటెడ్ ముద్దుగుమ్మ అదా శర్మ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది.. ఇంతకూ ఏం చేసిందో తెలుసా..

Follow Us
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
సింగర్ మంగ్లీపై కేసు నమోదు..
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
వారిని ఆపడం ఇక అసాధ్యం.. అక్షయ తృతీయ తర్వాత జాక్‌పాట్!
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!