Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇటీవల థియేటర్లు తెరుచుకున్న డిజిటల్ ఫ్లాట్‏ఫామ్స్‏కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఈ క్రమంలో సూపర్ హిట్ సినిమాలతోపాటు..

Tharagathi Gadhi Daati: ఆహాలో సరికొత్త వినోదం.. తరగతి గది దాటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Tharagathi Gadhi Daati
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 2:10 PM

ఇటీవల థియేటర్లు తెరుచుకున్నా డిజిటల్ ఫ్లాట్‏ఫామ్స్‏కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఈ క్రమంలో సూపర్ హిట్ సినిమాలతోపాటు.. సస్సెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‏లను ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ముందుకు తీసుకువస్తూ సరికొత్త కంటెంట్‏తో ఆడియన్స్‏కు చేరువవుతుంది తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. కరోనా సమయంలోనూ ఇతర ఓటీటీ కంటెంట్స్‏కు పోటీనిస్తూ.. కంటెంట్ ప్రాధాన్యత చిత్రాలతోపాటు.. వెబ్ సిరీస్‏లను అందిస్తూ.. ఒక్కసారిగా టాప్‏లో నిలిచింది. కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‏లు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీ టాల్క్ షోల ద్వారా ఎల్లప్పుడు వినోదాన్ని అందిస్తుంది ఆహా. తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా.. తమిళ్, హిందీ, మలయాళ చిత్రాలను తెలుగులో డబ్ చేసి మరీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది. ఇటీవల ఆహాలో విడుదలైన నీడ, సూపర్ డీలాక్స్ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇటీవల హీరోయిన్ అమల పాల్ నటించిన కుడి ఎడమైతే వెబ్ సిరీస్ ఆహాలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు సరికొత్త సిరీస్‏ను అందుబాటులోకి తీసుకువస్తుంది.

హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలలో నటించిన వెబ్ సిరీస్ తరగతి గది దాటి. సెంటర్ ఫ్రెష్ సమర్పణలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ టీవీఎఫ్. ఒరిజినల్ ఫ్లేమ్స్‏కు రీమేక్. పెళ్లి గోల అనే పాపులర్ వెబ్ సిరీస్ చేసిన దర్శకుడు మల్లిక్ రామ్ తరగతి గది దాటి సిరీస్‏ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తరగతి గది దాటి సిరీస్ టీజర్‏ను సోమవారం పీవీపీ మాల్‏లో విడుదల చేశారు. ఇద్దరు టీనేజర్ల మధ్య ఏర్పడ్డ అందమైన ప్రేమ కథను వినూత్నంగా చూపించడమే ఈ సిరీస్ అని మేకర్స్ అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‏ను రాజమండ్రి నేపథ్యంలో సాగుతుందని.. వెబ్ సిరీస్ మొత్తం 5 ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. మరో క్యూట్ లవ్ స్టోరీ రూపంలో డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లుగా తెలిపారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 20న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‏కు సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది.

Also Read: Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. క్షేమంగా తీసుకువస్తాం..విదేశీ వ్యవహారాల శాఖ..

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు.. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి జారీ

Viral Video: భూమి లోపల దాక్కున్నా వదలని సింహం.. అడవిపందిని ఎలా వేటాడిందంటే..? వీడియో చూస్తే షాక్..