Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు.. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి జారీ

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు.. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి జారీ
Afghanistan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 6:20 AM

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేక ఆఫ్ఘనిస్తాన్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అంతేకాదు సంప్రదింపుల కోసం మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి కూడా జారీ చేసినట్లు ప్రకటించారు. అంతకుముందు యుద్ధంలో చిక్కుకొని, దేశాన్ని విడిచి వెళ్లాలనుకునే సిక్కులు, హిందువులకు సౌకర్యాలు కల్పిస్తామని భారతదేశం హామి ఇచ్చింది. తాలిబన్లు కాబూల్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం నుంచి అన్ని వాణిజ్య విమానాలు నిలిపివేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత భారతదేశ అత్యున్నత రక్షణ అధికారులు, విదేశాంగ విధాన సంస్థ, సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న 200 మంది భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం అక్కడ భారత రాయబార కార్యాలయ సిబ్బంది, ఇతర భద్రతా సిబ్బంది ఉన్నారు.

గత కొన్ని రోజులుగా కాబూల్‌లో భద్రతా పరిస్థితి మరింత దిగజారిందని విదేశాంగ శాఖ తెలిపింది. కాబూల్ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలను సోమవారం నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ప్రజలను తిరిగి తీసుకురావడానికి ఇబ్బందులు తలెత్తయన్నారు. విమానాల పున ప్రారంభం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని ఉన్నత స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో భారతీయ పౌరుల భద్రత, వారి ప్రయోజనాలను కాపాడటానికి భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించింది.

Sports Photos: చీరలో ‘సింధు’ మెరిసే..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు

Two Headed Cobra: వామ్మో రెండు తలల నాగుపాము..! చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

IND vs ENG 2nd Test : లార్డ్స్‌లో దుమ్మురేపిన టీమిండియా బౌలర్లు.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం..