Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. క్షేమంగా తీసుకువస్తాం..విదేశీ వ్యవహారాల శాఖ..
అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు అందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ,తీసుకుంటున్నట్లు
అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు అందరినీ క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారి అరిందమ్ బాగ్చి తెలిపారు. అక్కడ మన దేశ ప్రయోజనాల పరిరక్షణకు విదేశీ వ్యవహారాల శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. తాలిబన్ల విజయంతో వేగంగా మారిపోతున్న పరిస్థితులను ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి వాణిజ్య విమాన సర్వీసులు నిలిచిపోవడం సహాయక చర్యలకు అవరోధంగా మారిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి సోమవారం డిల్లీలో చెప్పారు. విమానాల రాకపోకల పునరుద్ధరణ జరగ్గానే తరలింపును ప్రారంభిస్తామన్నారు. ఆఫ్గాన్‌ను వీడాలని భావిస్తున్న సిక్కులు, హిందువులను తీసుకొచ్చేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్ ఎర్పాటు చేసినట్లు అరిందమ్ బాగ్చి వివరించారు.
విద్య, అభివృద్ధి అంశాల్లో మనతో కలిసి పనిచేసిన అఫ్గాన్ ప్రజలు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ అండగా నిలుస్తామని తెలిపారు. సి-17 గ్లోబ్‌మాస్టర్3 భారీ విమానాలను ఏ క్షణంలోనైనా కాబుల్‌కు పంపించేందుకు సిద్ధంగా ఉంచినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆదివారం రాత్రి భారత వాయుసేనకు చెందిన భారీ విమానం ఒకటి ఇరాన్ గగనతలం నుంచి అఫ్గానిస్థాన్‌కు వెళ్లి మన దేశానికి చెందిన కొందరిని తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. భారత రాయబార కార్యాలయం సిబ్బంది, భద్రతా విభాగాల వారితో పాటు దాదాపు 200మంది భారతీయులను త్వరితగతిన వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భారత-టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన సాయుధ పారామిలిటరీ దళాలు దౌత్య కార్యాలయ సిబ్బంది రక్షణ విధుల్లో నిమగ్నమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అవసరమైనంత కాలం వరకూ ఐటీబీపీ దళాలు కాబుల్‌లోనే ఉంటాయని తెలిపాయి.
Viral Video: భూమి లోపల దాక్కున్నా వదలని సింహం.. అడవిపందిని ఎలా వేటాడిందంటే..? వీడియో చూస్తే షాక్..