Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగివస్తున్న పసిడి ధరలు..ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగివస్తున్న పసిడి ధరలు..ఈ  రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price
Follow us
Subhash Goud

|

Updated on: Aug 17, 2021 | 8:14 AM

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు తాజాగా దిగి వచ్చాయి. పసిడి అంటే భారతీయులకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యధికంగా విలువ ఇస్తుంటారు మహిళలు. ధర ఎంత పెరిగినా కూడా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పెరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టగా, మరి కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. ఇక మరి కొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. మంగళవారం (ఆగస్టు 17) ఉదయం ఆరు గంటలకు నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,360 ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,480 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,530 ఉంది.

► ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,980 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,980 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.

► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,010 ఉంది.

అయితే బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. గత 10 రోజుల్లో బంగారం ధరలు 3 రోజులు తగ్గాయి. 4 రోజులు పెరిగాయి. 3 రోజులు స్థిరంగా ఉన్నాయి. మరోలా చూస్తే.. గత 10 రోజుల్లో నగల బంగారం 10 గ్రాములు ధర రూ.540 తగ్గింది. కాబట్టి మనం నగలు కొనుక్కోవచ్చు అని నిర్ణయించుకోవద్దు. గత ఏడాది కాలంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. గత సంవత్సరం ఆగస్ట్ 17న ఇదే 10 గ్రాముల నగల బంగారం ధర రూ.51,670 ఉంది. ఇప్పుడు రూ.44,010 ఉంది. అంటే.. ఏడాది కాలంలో బంగారం ధర రూ.7,660 తగ్గింది. అంటే.. ఇప్పుడు మనం పసిడి కొనుగోలు చేయవచ్చు.

ఇవీ కూడా చదవండి

GST: జీఎస్టీ అంటే ఏమిటి.. ఇందులో మూడు రకాలు.. ఎవరి వాటా ఎంత.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే 15 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే పీఎఫ్‌ డబ్బులు ఇరుక్కుపోతాయి!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!