Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. దిగివస్తున్న సిల్వర్ రేటు .. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న సిల్వర్.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా..
Silver Price Today: భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇటీవల నుంచి తగ్గుతూ పెరుగుతున్న సిల్వర్.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే నిన్న పెరిగిన బంగారం ధరలు లాగానే వెండి కూడా పెరిగింది. దేశీయంగా కిలో రూ.70 వేల వరకు ఉన్న వెండి.. రోజురోజుకు దిగివస్తోంది. మంగళవారం (ఆగస్టు 17) ఉదయం 6 గంటల సమయానికి దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.62,700 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,700 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, కోల్‌కతాలో రూ.62,700 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.62,700 ఉండగా, కేరళలో రూ.68,200 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.62,700 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,200 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,200 ఉంది. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిది.
అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
స్టాక్ మార్కెట్లు నిన్న కళకళలాడాయి. గత వారం లాగే.. మళ్లీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు బలపడితే.. నిఫ్టీ 34 పాయింట్లు బలపడింది. అంటే ఇన్వెస్టర్లకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల లాభం వచ్చినట్లే. ఐతే.. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు. ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకం వల్ల త్వరలోనే ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయ్యే అవకాశం ఉంది. కాగా, చిన్న ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా అంచనాలు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ పరిస్థితులను కంటిన్యూగా గమనిస్తూ ఉండాలి. ఆసియా మార్కెట్లపై ఓ కన్నేసి ఉంచాలి. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆ ప్రభావం ఇవాళ ఆసియా మార్కెట్లపై పడుతుంది. అందుకే ఈరోజు మన స్టాక్‌మార్కెట్ కూడా కొంత ప్రభావితం అయ్యే అవకాశాలు ఉండవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు ముందుగా ఈ రోజు ఆ సమయానికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది. ఎందుకంటే బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.