Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Lunch Time: మీరు లంచ్‌ టైమ్‌లో బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీ సమయం వృధా కాకుండా ఈ సమయాలను గుర్తించుకోండి

SBI Lunch Time: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 22,000 శాఖలను కలిగి ఉంది. ఇందులో మొత్తం 450 మిలియన్..

SBI Lunch Time: మీరు లంచ్‌ టైమ్‌లో బ్యాంకుకు వెళ్తున్నారా? అయితే మీ సమయం వృధా కాకుండా ఈ సమయాలను గుర్తించుకోండి
State Bank of India
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2021 | 1:45 PM

SBI Lunch Time: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా 22,000 శాఖలను కలిగి ఉంది. ఇందులో మొత్తం 450 మిలియన్ కస్టమర్లు ఉన్నారు. అదే సమయంలో కోట్ల మంది కస్టమర్‌లు దాని అనుబంధ సేవా ప్రదాతలు ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్‌బీఐ కార్డ్స్ మొదలైన వాటితో అనుసంధానమై ఉన్నారు. అయితే ఎస్‌బీఐ (SBI) తన బ్యాంక్ కస్టమర్లను సంతృప్తి పరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మధ్యాహ్నం సమయంలో బ్యాంకు పనులపై వెళ్లిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు బ్యాంకు సిబ్బంది గుర్తించారు. చాలా మంది కస్టమర్లు బ్యాంక్ కార్యాచరణ, సర్వీస్ లేదా మరేదైనా కారణంతో అసంతృప్తిగా కనిపిస్తున్నారు. కస్టమర్‌లు తమ సమస్యలను లేదా అభ్యంతరాలను ఎస్‌బీఐ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా నమోదు చేస్తారు. అలాంటి ప్రశ్నలపై ఎస్‌బీఐ శాఖ సమాధానం ఇస్తుంటుంది.

బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల ప్రశ్నలకు బ్యాంక్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా సమాధానం ఇవ్వబడుతుంది. మధ్యాహ్న భోజన సమయాలకు సంబంధించి ప్రశ్నలు చాలా మంది తలెత్తుతుంటాయి. అయితే చాలా మంది ఇంటి నుంచి బయలుదేరి బ్యాంకుకు వెళ్లిన సమయంలో బ్యాంకు సిబ్బంది కౌంటర్‌లో ఉండదరు. ఆ సమయంలో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. మీరు వెళ్లింది లంచ్‌ సమయంలో. అలాంటి సమయంలో బ్యాంకు సిబ్బంది కొంత సేపు ఉండరని బ్యాంకు చెబుతోంది. ఈ విషయంపై బ్యాంక్ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బంది పని గంటలు బ్యాంకులో ఉన్న బోర్డుపై నమోదు చేయడం జరుగుతుంది అని అన్నారు.

మధ్యాహ్న భోజన సమయం గురించి ..

ఎస్‌బీఐ లంచ్ సమయానికి సంబంధించి వినియోగదారులలో కూడా గందరగోళం ఉంటుంది. అనేక సార్లు మీరు ఏదో ఒక బ్యాంక్ పని కోసం ఇంటి నుండి బయలుదేరి, బ్యాంకుకు చేరుకుని, మీరు సంబంధిత కౌంటర్‌కు వెళ్లిన వెంటనే, బ్యాంకర్ అక్కడ కనిపించడు. బ్యాంకు సిబ్బంది భోజనం చేయడానికి వెళ్లినట్లు అక్కడి సిబ్బంది చెబుతుంటారు. లంచ్‌ సమయంలో రావడం వల్ల వినియోగదారులు చికాకు పడుతుంటారు. మీరు బ్యాంకుకు సరైన సమయంలో రాకుండా లంచ్‌ సమయంలో బ్యాంకుకు రావడం వల్ల సిబ్బంది కనిపించకపోవడంతో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, బ్యాంకు సిబ్బంది పని వేళలు గమనించాలని బ్యాంకు అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు

భోజన సమయం అరగంట:

ఎస్‌బీఐతో సహా అనేక బ్యాంకులలో భోజన సమయం అరగంట. ఎస్‌బీఐలో మధ్యాహ్న భోజనానికి ప్రామాణిక సమయం మధ్యాహ్నం 2:30 నుండి 3:00 గంటల వరకు ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులు మధ్యాహ్న భోజనం చేయడానికి ఇదే సమయం. అయితే వినియోగదారుల సౌకర్యార్థం, బ్యాంక్ శాఖ స్థాయి నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. డిపాజిట్, ఉపసంహరణ .. ఈ రెండు కౌంటర్‌లు అత్యంత రద్దీగా ఉంటాయి. డిపాజిట్, విత్‌డ్రా కోసం 2 కౌంటర్లు ఉన్న శాఖలలో సిబ్బంది ప్రత్యామ్నాయంగా భోజనానికి వెళ్తారు. ఉదాహరణకు.. ఒక కౌంటర్ వద్ద సిబ్బంది మధ్యాహ్నం 2:00 నుంచి 2:30 గంటల మధ్య భోజనం చేయడానికి వెళ్లాడనుకోండి.. తరువాత అతను వచ్చిన తర్వాత, ఇతర బ్యాంకర్ మధ్యాహ్నం 2:30 మరియు 3:00 గంటల మధ్య భోజనం చేయడానికి వెళ్తాడు. ఇలా వినియోగదారులకు ఇబ్బంది కాకుండా ఒకరి తర్వాత ఒకరు భోజనానికి వెళ్లారని.. ఈ విధంగా చేయడం వల్ల కస్టమర్లకు ఇబ్బంది ఉండదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.

అటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాటుతో కస్టమర్ల పని నిరంతరాయంగా కొనసాగుతుంది. అయితే భోజన సమయం మధ్యాహ్నం 2:30 నుండి 3:00 వరకు ఉంటుంది. డిపాజిట్, విత్‌డ్రా కోసం ఒకే ఒక కౌంటర్ ఉన్న చోట, అంటే సిబ్బంది తక్కువగా ఉంటారు కాబట్టి.. మధ్యాహ్నం 2:30 – 3:00 గంటల మధ్య బ్యాంకు సిబ్బంది భోజనం కోసం వెళతారు. ఒకే కౌంటర్‌ ఉన్న సమయంలో కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

Sbi

ఇవీ కూడా చదవండి:  GST: జీఎస్టీ అంటే ఏమిటి.. ఇందులో మూడు రకాలు.. ఎవరి వాటా ఎంత.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

మీరు ఉద్యోగం చేస్తున్నారా..? అయితే 15 రోజుల్లో ఈ పనిని పూర్తి చేయండి.. లేకపోతే పీఎఫ్‌ డబ్బులు ఇరుక్కుపోతాయి!

ATM Fraud: మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీ కార్డు క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం..!