ATM Fraud: మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీ కార్డు క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం..!

ATM Fraud: ప్రస్తుతం బ్యాంకింగ్‌ సర్వీసులన్నీ ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఇక ఏటీఎం మోసాలు..

ATM Fraud: మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మీ కార్డు క్లోనింగ్‌కు గురయ్యే అవకాశం..!
ATM
Follow us
Subhash Goud

|

Updated on: Aug 16, 2021 | 1:11 PM

ATM Fraud: ప్రస్తుతం బ్యాంకింగ్‌ సర్వీసులన్నీ ఆన్‌లైన్‌ అయిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. ఇక ఏటీఎం మోసాలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు బ్యాంకింగ్‌ వ్యవస్థ, పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. కరోనా మహమ్మారి పెరిగినప్పటి నుంచి మోసాలు పెరిగిపోతున్నాయి. ఏటీఎం కార్డులను సైతం క్లోన్‌ చేయబడుతున్నాయి. అయితే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఖాతా హ్యాక్‌కు గురై డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు టెక్‌ నిపుణులు. పెరుగుతున్న మోసాలని దృష్టిలో ఉంచుకుని ఎటీఎంల ద్వారా మోసం ఎలా జరుగుతుందో తెలుసుకోండి. తద్వారా మీరు మీ డబ్బును సురక్షితంగా ఉంచుకోవచ్చు.

సీక్రెట్ కెమెరా:

మీ ఏటీఎం పిన్ తెలుసుకోవటానికి ఏ‌టి‌ఎం చుట్టూ రహస్య కెమెరాలు ఉంటాయి. ఇవి మీరు చేసే ప్రతిదీ రికార్డ్ చేయగలవు. ఇలాంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ‌టి‌ఎం కార్డును ఉపయోగించే ముందు ఏ‌టీఎం కి ప్యాడ్ పైన, ఎలాంటివి(సి‌సి కెమరాలు, వెరైటీ కి ప్యాడ్, రంగు రంగుల లైట్స్) లేకుండా నిర్ధారించుకోండి. మీకు ఏమైనా సందేహం ఉంటే అక్కడ ఉన్న ఏటీఎం సెక్యూరిటిని, లేదా బ్యాంకు సిబ్బందికి సమాచారం అందించండి.

ఏటీఎం కార్డు క్లోనింగ్ అంటే ఏమిటి?

మోసగాళ్ళు కార్డు క్లోనింగ్ ద్వారా మీ ఎటిఎం కార్డుకు అక్సెస్ చేస్తారు. దీని తరువాత మిమ్మల్ని మోసం చేయడం వారికి పెద్ద విషయం కాదు. మోసగాళ్ళు ఏటీఎం మెషీన్‌ వద్ద స్కీమర్ అనే యంత్రాన్ని ఉంచుతారు. ఈ యంత్రం ద్వారా కార్డు స్వైప్ చేసినప్పుడు దాని సమాచారం మొత్తం అందులోకి కాపీ అయిపోతుంది. దీంతో మీ బ్యాంక్ ఖాతాతో అనుబంధించబడిన మొత్తం సమాచారం ఉంటుంది. మోసగాళ్ళు ఈ సమాచారాన్ని వేరే ఖాళీ కార్డుకు బదిలీ చేస్తారు. ఈ విధంగా మోసగాళ్ళు మరొక కార్డును తయారు చేస్తారు. ఇది మీ కార్డుకి సంబంధించిన పూర్తి సమాచారంతో ఉంటుంది. ఇప్పుడు దాని నుండి మోసగాళ్ళు డబ్బును ఉపసంహరించుకుంటారు. ఇలా కార్డు క్లోనింగ్‌ ద్వారా మీ ఖాతాను ఖాళీ చేసే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

అయితే ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు వచ్చినప్పుడు లావాదేవీ మొత్తం ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత కూడా ఏటీఎం (ATM) నుండి డబ్బు బయటకు రాలేదు. కస్టమర్‌కు అనుమానం వచ్చి ఏటీఎం మెషీన్ వైపు జాగ్రత్తగా చూడగా, పిన్ నంబర్ టైప్ చేసిన ప్రదేశానికి ఓ ప్లేట్ అతికించబడిందని కస్టమర్ గుర్తించారు. ప్లేట్‌లో కెమెరా, SD కార్డు, బ్యాటరీ ఉన్నాయి. మోసగాళ్లు అటువంటి పరికరాల నుండి ATM కార్డులను క్లోన్ చేసి, ఆపై కార్డుదారుడి ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును దోచుకుంటారు. ఇలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

► మీరు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం వద్దకు వెళ్లినప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

► మీరు ఏటీఎం నుండి డబ్బు ఉపసంహరించుకునేటప్పుడు మీ చుట్టూ ఎవరో ఒకరు నిలబడి ఉంటారు. ఎవరైనా మీ పక్కన నిలబడి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ వెనుక నిలబడి ఉన్న వ్యక్తి మీ ఏటీఎం పిన్ చూసిన తర్వాత మీ ఖాతాను హ్యాక్ చేయవచ్చు.

► షాపింగ్ మాల్స్ లో లేదా మరెక్కడైనా ఏదైనా కొనుగోలు చేశాక మీరు కార్డుతో చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎల్లప్పుడూ మీ కార్డును మీ ముందు స్వైప్ చేసి అందులో పాస్‌వర్డ్‌ను మీరే ఎంటర్ చేయాలి. మీ పాస్ వర్డ్ వేరే వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త వహించాలి.

ఇవీ కూడా చదవండి! Debit Card EMI: ఈ బ్యాంకు డెబిట్‌ కార్డుతో ఈఎంఐ ఆప్షన్‌.. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలన్నీ పొందవచ్చు..!

Health Insurance: మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి.. లేకపోతే ఇబ్బందే!