AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telegraph: మొదటి టెలిగ్రాఫ్ మెసేజ్ ఎవరు పంపించారో తెలుసా? ఆ సందేశం అవతలి వారికి చేరుకోవడానికి ఎంత టైం పట్టిందంటే..

ఇప్పుడు మనం ప్రపంచంలో ఏమూలన ఉన్నవారితోనైనా అత్యంత సులువుగా మాట్లాడగలుగుతున్నాం.  సందేశాలు పంపించగలుగుతున్నాం.

Telegraph: మొదటి టెలిగ్రాఫ్ మెసేజ్ ఎవరు పంపించారో తెలుసా? ఆ సందేశం అవతలి వారికి చేరుకోవడానికి ఎంత టైం పట్టిందంటే..
Telegraph
KVD Varma
|

Updated on: Aug 16, 2021 | 4:09 PM

Share

Telegraph: ఇప్పుడు మనం ప్రపంచంలో ఏమూలన ఉన్నవారితోనైనా అత్యంత సులువుగా మాట్లాడగలుగుతున్నాం.  సందేశాలు పంపించగలుగుతున్నాం. అవసరమైతే ఓ వీడియో కాల్ చేసి వారి క్షేమ సమాచారాలు సెకన్లలో తెలుసుకోగలుగుతున్నాం. కానీ సమాచార వ్యవస్థ ఇలా ఈ స్థాయికి రావడానికి ముందు సమాచారాన్ని చేరవేసే విధానాలు చాలా ఆలస్యంతో కూడుకున్నవిగా ఉండేవి. సందేశాలను పంపించటం కోసం.. తొలిసారిగా జరిగిన ప్రయత్నం 1858లో జరిగింది. ఆ సంవత్సరం ఆగస్టు 16న విక్టోరియా రాణి అమెరికా అధ్యక్షుడికి టెలిగ్రాఫ్ సందేశం పంపింది. ఈ సందేశం లండన్ నుండి వాషింగ్టన్ చేరుకోవడానికి 18 గంటలు పట్టింది, ఆ సమయంలో ఇది అత్యంత వేగవంతమైన సాంకేతికత.

ఈ సందేశానికి ప్రతిస్పందనగా, అమెరికా అధ్యక్షుడు 143 పదాల టెలిగ్రాఫ్ సందేశాన్ని కూడా పంపారు. ఈ సందేశాన్ని క్వీన్ విక్టోరియా 10 గంటల్లో అందుకుంది.

టెలిగ్రాఫ్ రూపొందింది ఇలా..

టెలిగ్రాఫ్‌ను శామ్యూల్ మోర్స్ రూపొందించారు. 1840 లో అతను టెలిగ్రాఫ్ కోసం పేటెంట్ పొందాడు. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు మోర్స్ కు టెలిగ్రాఫ్ చేయాలనే ఆలోచన వచ్చిందని అంటారు. ఫారడే విద్యుదయస్కాంతాన్ని కనుగొన్నట్లు మోర్స్ ప్రయాణికుల నుండి విన్నాడు. అతను విద్యుదయస్కాంతాల గురించి చదివాడు. అవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సందేశాలను పంపడానికి కూడా ఉపయోగపడుతాయని భావించాడు.

అతను ఆంగ్లంలో ప్రతి అక్షరానికి చిన్న గీతలు..చుక్కల కలయికను సృష్టించాడు, దీనికి మోర్స్ కోడ్ అని పేరు పెట్టారు. సందేశాన్ని పంపడానికి ప్రతి అక్షరం కోసం వేర్వేరు గదులు తయారు చేశారు. ప్రతి అక్షరాన్ని సమీకరించడం ద్వారా పదాలు తయారు చేశారు. ఈ విధంగా మొత్తం సందేశం రాశారు.

ఈ స్లాట్‌లపై సన్నని ఎలక్ట్రిక్ ప్లేట్ పాస్ చేయబడింది, ఇది స్లాట్‌ల పరిమాణాన్ని బట్టి ఎలక్ట్రిక్ సర్క్యూట్‌ను ఆఫ్ చేస్తుంది, ఆన్ చేస్తుంది. సర్క్యూట్ ఆన్‌లో ఉన్నప్పుడు, లైన్‌లు, చుక్కలు రిసీవర్ చివరలో ఏర్పడటం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, ప్రతి అక్షరం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంక్తులు, చుక్కల ద్వారా పంపించేవారు.

1858 లో ఈ రోజున, విక్టోరియా రాణి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ బుకానన్ కు ఒక టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపారు. ఉదయం 10.50 కి రాణి సందేశం పంపింది. ఈ 99 పదాల సందేశంలో 509 అక్షరాలు ఉన్నాయి. మరుసటి రోజు సాయంత్రం 4.30 కి మెసేజ్ బుకానన్ కి చేరింది. సందేశం చేరడానికి దాదాపు 18 గంటలు పట్టింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా పంపిన మొదటి అధికారిక టెలిగ్రాఫ్ సందేశం కూడా ఇదే.

Also Read: Smart Cooker: ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్‌తో కూరలు చేసుకోవడం చాలా ఈజీ.. వీటి ఫీచర్లు తెలిస్తే వావ్ అంటారు!

Realme Laptop: మీ ల్యాప్‌టాప్‌లను బద్దలు కొట్టండని చెబుతోన్న రియల్‌మీ.. సరికొత్త ప్రచారానికి తెర తీసిన టెక్‌ దిగ్గజం.