Facebook New Feature: ఇకపై మీ ఫేస్‌బుక్ చాటింగ్ ఫుల్ సెక్యూర్.. సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న టెక్ దిగ్గజం.
Facebook New Feature: సోషల్ మీడియా రాకతో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేశాయి ఈ సైట్లు. అయితే సోషల్ మీడియాతో సమాచార మార్పిడి చాలా సులభంగా..
Facebook New Feature: సోషల్ మీడియా రాకతో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేశాయి ఈ సైట్లు. అయితే సోషల్ మీడియాతో సమాచార మార్పిడి చాలా సులభంగా మారిందని అంతా సంతోషిస్తోన్న వేళ ప్రైవసీ ప్రధాన సమస్యగా మారింది. ఇద్దరు వ్యక్తులు చేస్తోన్న చాటింగ్‌ను సోషల్ మీడియా కంపెనీలు చూస్తే ఎలా అనే ఓ ప్రశ్న అందరి మెదళ్లోనూ తలెత్తింది. అయితే దీనికి చెక్ పెట్టడానికే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వాయిస్, వీడియో కాల్స్, టెక్ట్స్ మెసేజ్‌లు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యే ఉంటాయి. దీంతో యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ఢోకా ఉండదు.
ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను తమ యూజర్లకు కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఇకపై ఫేస్‌బుక్‌లో పంపించుకునే సందేశాలను యూజర్, రిసీవర్ తప్ప మరెవరూ చూసే అవకాశం లభించదు. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.. మరికొద్ది రోజుల్లోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్ త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఫేస్‌బుక్ గ్రూప్‌చాట్‌లలోనూ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న డిస్పప్పియర్ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లోనూ తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో నిర్ణీత సమయం తర్వాత ఫేస్‌బుక్‌లో మీరు పంపించిన మెసేజ్‌ను అవతలి వ్యక్తికి కనిపించకుండా చేసుకోవచ్చన్నాట. ఈ ఫీచర్ సహాయంతో మెసేజ్‌ను 5 సెకన్ల నుంచి 24 గంటల్లోపు డిస్‌అప్పియర్ అయ్యేలా చేసుకోవచ్చు.
Telangana: రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్