Telangana: రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

తెలంగాణలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతమైంది. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించారు.

Telangana: రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
Telangana Runamafi
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 16, 2021 | 8:14 PM

తెలంగాణలో రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతమైంది. రూ.25 వేల నుండి రూ.25,100 వరకు రుణాలున్న వారి ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించారు. తొలిరోజు 1309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేశారు. ఈ నెల 30 వరకు ప్రక్రియ కొనసాగనుంది. రూ.50 వేల రూపాయల లోపు గల రైతుల రుణాలన్నీ మాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతుబంధు నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులు కూడా జమ అవుతాయి. 25వేలు, 26వేలు, 27వేలు స్లాబుల వారీగా రుణమాఫీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఆయన చెప్పారు.  నెలాఖరు వరకు 2005 కోట్లా 85 లక్షల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు. సోమవారం నుంచి రుణమాఫీ మొదలయిన నేపథ్యంలో రైతు లోకానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2014 నుంచి 18 వరకు 16,144 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయని అన్నారు. 2018లో 25 వేలలోపు రుణాలున్న 2.96 లక్షల మంది రైతులకు 408.38 కోట్ల మేర మాఫీ అయిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు రాష్ట్ర రైతుల పక్షాన థ్యాంక్స్ చెప్పిన నిరంజన్ రెడ్డి… సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగానికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలచారని అన్నారు. ఆకలితో అలమటించిన తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపారని మంత్రి పేర్కొన్నారు. పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.

రైతుల ఖాతాలలో జమయిన నిధులను బ్యాంకర్లు ఇతర పద్దుల కింద జమ చేసుకోవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రుణాలు మాఫీ అయిన రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని సూచించింది.  

Also Read: వెంటాడిన పేదరికం.. “పై చదువులు చదవలేనేమో”.. ప్రాణం తీసుకున్న పూజిత

ఏపీకి నేడు, రేపు భారీ వర్షసూచన.. వారికి విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ అలెర్ట్

మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
హీరోయిన్‌కు బాధ.. ఫ్యాన్స్‌కు సంతోషం.! రష్మిక పోస్ట్‌కు మిక్స్‌డ్
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది