Anantapur District: వెంటాడిన పేదరికం.. “పై చదువులు చదవలేనేమో”.. ప్రాణం తీసుకున్న పూజిత

Anantapur District: వెంటాడిన పేదరికం.. పై చదువులు చదవలేనేమో.. ప్రాణం తీసుకున్న పూజిత
Student Suicide

మనదేశంలో ఇంకా చాలామంది యువతీ యువకులు పేదరికం కారణంగా పై చదువులు చదవలేకపోతున్నారు. మరికొందరు పేదరికం కారణంగా..

Ram Naramaneni

|

Aug 16, 2021 | 7:37 PM

మనదేశంలో ఇంకా చాలామంది యువతీ యువకులు పేదరికం కారణంగా పై చదువులు చదవలేకపోతున్నారు. మరికొందరు పేదరికం కారణంగా తమ ఆశయాలు చేరకోలేక ప్రాణాలు చాలిస్తున్నారు. తాజాగా  కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పై చదువులకు పంపరేమో అన్న అనుమానంతో ఓ విద్యార్థిని  గ్రామానికి దగ్గర్లోని చెరువులో దూకి తనువు చాలించింది.  అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంటలో ఈ విషాద ఘటన చోటుచేసింది. యువతి మృతదేహం కనిపించిన అనంతరం తల్లిదండ్రులు రోదించడం అక్కడివారి మనసులను కదిలించింది. వివరాల్లోకి వెళ్తే.. గాండ్లపెంట మండలం వేపలకుంటకు చెందిన వాసు, హక్కులమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజిత ఇటీవలే టెన్త్ పాస్ అయ్యింది. ఇంటర్​లో చేరాల్సి ఉంది. పూజిత వాళ్లది ఉమ్మడి కుటుంబం. వాసు తన సోదరులతో కలిసి జీవిస్తున్నారు. వాసుతో పాటు సోదరుడికి పిల్లలు ఉన్నారు. వరుసగా నష్టాలు ఎదురవ్వడం, కరోనా వైరస్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితుల్లో పిల్లల చదువు మానిపించాల్సిన పరిస్థితులు వచ్చాయని ఇంట్లోని పెద్దలు ఆ మాటలు విన్న పూజిత తన మసులో బాధపడింది. నాలుగైదు రోజులుగా ఇంట్లో ఏదో కోల్పోయినట్లు ఉంటుంది. కుటుంబ సభ్యులు పగలంతా పొలం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి రావడం కారణంగా పూజిత మానసిక పరిస్థితిని అంచనా వేయలేక పోయారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనను ఇంటర్మీడియట్ చదివించలేరని, తాను కుటుంబానికి భారం కాకూడదని నిర్ణయానికి వచ్చిన పూజిత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. పూజిత కోసం కుటుంబ సభ్యులు బంధువుల ఊళ్లతో పాటు గ్రామంలోని పరిచయస్థులు, పరిసర గ్రామాల్లోనూ గాలించారు. బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో గాండ్లపెంట పోలీసులకు కంప్లైంట్ చేశారు. పూజిత క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందన్న భావిస్తున్న కుటుంబ సభ్యులకు అందిన వార్త.. షాక్‌కు గురిచేసింది. అదృశ్యమైన పూజిత గ్రామానికి సమీపంలోని గండిచెరువులో విగతజీవిగా తేలియాడుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో చెరువు వద్దకు చేరుకున్న పూజిత తల్లిదండ్రులు గుండెలవిసేలా బోరున విలపించారు. డెడ్‌బాడీని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తామని గాండ్లపెంట పోలీసులు తెలిపారు.

Also Read: ఏపీకి నేడు, రేపు భారీ వర్షసూచన.. వారికి విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ అలెర్ట్

 ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 1000లోపే కరోనా కేసులు.. రెండు శాతం కంటే దిగువకు పాజిటివిటీ రేటు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu