San Antonio Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి..

San Antonio sports bar shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. యూఎస్ టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో నగరంలోని స్పోర్ట్స్‌ బార్‌లో

San Antonio Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి..
Gun Fire
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 6:55 AM

San Antonio sports bar shooting: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. యూఎస్ టెక్సాస్‌ రాష్ట్రంలోని శాన్‌ ఆంటోనియో నగరంలోని స్పోర్ట్స్‌ బార్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. యువకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కాల్పులకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘర్షణ అనంతరం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. తెల్లవారు జామున 3.30గంటల సమయంలో బూమ్‌ బూమ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు టెక్సాస్ పోలీసులు వెల్లడించారు. గొడవ అనంతరం ఓ వ్యక్తి కారులో వచ్చి తుపాకీతో పార్కింగ్‌ వద్దే ఐదుగురిపై కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.

ఈ కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. బాధితులంతా 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారని.. బార్‌లో ఏదో విషయంపై గొడవ తలెత్తిందన్నారు. నిందితుడి వయస్సు కూడా దాదాపు అంతే ఉంటుందని శాన్ ఆంటోనియో పోలీస్ చీఫ్ విలియం మెక్‌మానస్ తెలిపారు. గొడవకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు చెప్పడంలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

కాగా.. అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతకుమందు పలు ప్రాంతాల్లో జరగిన కాల్పుల ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Guntur Ramya Murder: రమ్య మర్డర్ వెనుక మిస్టరీ వీడింది.. కీలక విషయాలు వెల్లడించిన గుంటూరు డీఐజీ రాజశేఖర్‌బాబు

Afghanistan: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురు దుర్మరణం