Cyber Crime: లక్కీ డ్రాలో కారొచ్చిందంటూ ఫోన్.. నిజమని నమ్మి కేటుగాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..

Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు సైబర్‌ నేరాల కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. నిందితులు రెచ్చిపోతూనే

Cyber Crime: లక్కీ డ్రాలో కారొచ్చిందంటూ ఫోన్.. నిజమని నమ్మి కేటుగాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కయ్యాడు..
Cyber Crime
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 7:30 AM

Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు సైబర్‌ నేరాల కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. నిందితులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా లక్కీడ్రాలో విలువైన కారు గెలుపొందారంటూ సైబర్‌ నేరగాళ్లు రూ.17.35 మోసం చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని గోల్కొండలో చోటుచేసుకుంది. లక్కీడ్రాలో ఎక్స్‌యూవీ కారు వచ్చిందని నమ్మించిన సైబర్‌ మోసగాళ్లు అతని నుంచి రూ. 17.35 లక్షలు కాజేశారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన ముజాహిద్‌ఖాన్‌కు కొన్నిరోజుల క్రితం ఓ గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. లక్కీ డ్రాలో విలువైన కారు వచ్చిందని.. దాన్ని ఇంటి వద్దకు చేర్చడానికి కొన్ని ఖర్చులు ఉంటాయని నమ్మించాడు. అయితే.. నిజమని భావించిన బాధితుడు ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్సు చార్జీలు, టాక్సుల పేరిట పలు విడతలుగా రూ.17.35 లక్షల నగదును నేరస్థులకు పంపించాడు.

అనంతరం మోసగాళ్లు ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళన చెందాడు. తీరా మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన మోసం గురించి ముజాహిద్ పోలీసులకు వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఫోన్ నెంబర్లను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

నైజీరియన్‌ అరెస్టు.. గతంలో రూ.16 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నిందితుడిని సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళకు విలువైన బహుమతి వచ్చిందని సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. వివిధ ఛార్జీల పేరుతో రూ.16 లక్షలను కాజేయగా.. బాధిత మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఢిల్లీలో ఉన్న మైకేల్ అనే నైజీరియన్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

San Antonio Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి..

Anantapur District: వెంటాడిన పేదరికం.. “పై చదువులు చదవలేనేమో”.. ప్రాణం తీసుకున్న పూజిత

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!
అక్షర్ పటేల్ జీవితంలో కొత్త అధ్యాయం - హక్ష్ పటేల్‌కు స్వాగతం!