జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ డ్రోన్లు ..? భద్రతా దళాల విస్తృత గాలింపు..ఉగ్ర దాడిలో సీఆర్ఫీఎఫ్ జవానుకు గాయాలు
జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో డ్రోన్లుగా అనుమానిస్తున్నవాటిని భద్రతా దళాలు మళ్ళీ కనుగొన్నాయి. ఈ జిల్లాలోని విజయ్ పూర్, రామ్ ఘర్, గర్వాల్ ప్రాంతాల్లో ఇవి కనిపించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో విస్తృత గాలింపు ప్రారంభించారు.
జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో డ్రోన్లుగా అనుమానిస్తున్నవాటిని భద్రతా దళాలు మళ్ళీ కనుగొన్నాయి. ఈ జిల్లాలోని విజయ్ పూర్, రామ్ ఘర్, గర్వాల్ ప్రాంతాల్లో ఇవి కనిపించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో విస్తృత గాలింపు ప్రారంభించారు. ఇటీవలే 5 కిలోల పేలుడు వస్తువులతో కూడిన డ్రోన్ ని నియంత్రణ రేఖ వద్ద భారత జవాన్లు కూల్చివేశారు. ఆఖ్ నూర్ లోని గురు పఠాన్ ప్రాంతంలో దీన్ని కూల్చి వేసి.. అందులోని పేలుడు వస్తువులను నిర్వీర్యం చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల నుంచి ఈ డ్రోన్ వచ్చిందని దీనికి ప్లాస్టిక్ ప్యాకెట్ లో బాంబులను అమర్చారని అధికారులు తెలిపారు. ఇది లష్కరే తోయిబా ఉగ్రవాదుల పనేనని వారు పేర్కొన్నారు. కాగా గతరాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో కుప్వారా జిల్లాలోని స్కూలు వద్ద గస్తీ విధుల్లో ఉన్న సీఆర్ పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అలెర్ట్ గా ఉన్న జవాన్లు కాల్పులు జరిపేలోగా వారు పారిపోయారు. బారాముల్లా టౌన్ లోని ఆజాద్ గంజ్ లో పోలీసు బృందంపై కూడా టెర్రరిస్టులు బాంబులు విసిరారు.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, అయితే ఓ వాహనం పూర్తిగా దెబ్బ తిన్నదని తెలిసింది. సెక్యూరిటీ దళాలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ పాక్ ఉగ్రవాదులు ఏదో ఒక సమయంలో దాడులకు దిగుతూనే ఉన్నారు. ముఖ్యంగా జమ్మూలో అనుమానిత డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఇవి కొద్ది క్షణాల్లో కనబడి కనుమరుగవుతున్నాయని అధికారులు తెలిపారు. డ్రోన్లను గానీ ఎగిరే వస్తువులను గానీ శ్రీనగర్ సహా ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో అన్ని చోట్ల ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి : స్మశానంలో పసికందు ఏడుపు..! దగ్గరకి వెళ్లి చుస్తే షాక్.. వైరల్ అవుతున్న వీడియో..:Babe Cemetery Viral Video.
అల్లు అర్జున్ , మహేష్ బాబు సినిమాలకు షాక్.. బడా మూవీలకు తప్పని లీకుల బాధ..:Movie Scenes Leak Video.
డేంజరస్ ఫుడ్.. ఇవి తింటే అంతే..!ఆహారపు అలవాట్లు మార్చుకోవాలంటున్న నిపుణులు..:Toxic Food Video.