PM Narendra Modi: నేడు పారా ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ.. వీక్షించాలంటూ ట్వీట్..
Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్ - 2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
Tokyo Paralympics 2020: పారా ఒలింపిక్స్ – 2020 కోసం భారత్ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ పారా అథ్లెట్లతో సంభాషించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. పారా అథ్లెట్లతో సంభాషించేందుకు ఎదురు చూస్తున్నానని.. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రధాని మోదీ ట్విట్‌లో క్రీడాభిమానులను కోరారు.
టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్ల బృందం టోక్యోకు వెళ్తుండగా.. ఈ అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. మొదటగా.. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. కాగా.. పారా ఒలింపిక్స్‌లో భారత్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారని క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం పాల్గొననున్నారు.
I look forward to interacting with India’s contingent at the #Paralympics tomorrow, 17th August at 11 AM. These are remarkable players who have shown outstanding skill and tenacity. I would urge sports lovers to watch the programme tomorrow.
— Narendra Modi (@narendramodi) August 16, 2021
కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బంగారు పతకం గెలవగా.. మీరాబాయి, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్ పునియా కాంస్య పతకాలు సాధించారు. దీంతోపాటు.. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.
Also Read: