Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు గ్రాండ్ వెల్‌కమ్.. స్వగ్రామంలో సంబురాలు..

Grand Welcome Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రాకు స్వస్థలంలో ఘనస్వాగతం లభించింది. హర్యానా పానిపట్‌లోని త

Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు గ్రాండ్ వెల్‌కమ్.. స్వగ్రామంలో సంబురాలు..
Neeraj Chopra
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 17, 2021 | 12:43 PM

Grand Welcome Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విన్నర్‌ నీరజ్‌ చోప్రాకు స్వస్థలంలో ఘనస్వాగతం లభించింది. హర్యానా పానిపట్‌లోని తన స్వగ్రామం సమల్ఖాలో గ్రాండ్‌ వెల్‌కమ్ పలికారు. దారిపొడవునా అతన్ని అభినందిస్తూ ప్రజలు స్వాగతం పలికారు. ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో నీరజ్‌ చోప్రా దేశానికి స్వర్ణం అందించి చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకున్నాడు. తన గ్రామస్తులు చూపిన ప్రేమపై నీరజ్‌ హర్షం వ్యక్తం చేశాడు. మీ నుంచి ఇంత ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉందని..రానున్న రోజుల్లోనూ తనకు ఇదే తరహా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. దేశానికి మరిన్ని పతకాలు తీసుకొచ్చేందుకు మరింత శ్రమిస్తానని నీరజ్ చోప్రా వెల్లడించాడు.

కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలవగా.. మీరాబాయి, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. దీంతోపాటు.. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

ఇదిలాఉంటే.. పారా ఒలింపిక్స్‌ కోసం భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు ప్రధాని మోదీ. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన క్రీడాకారులని అభినందించారు. టోక్యోలో పారా ఒలింపిక్స్‌ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్‌ 5వరకు జరగనున్నాయి. 54 మంది పారా అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. ఐతే పారా ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారని పేర్కొంది క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది.

Also Read:

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరుకు వేదిక ఖరారు..

PM Narendra Modi: నేడు పారా ఒలింపిక్స్‌ క్రీడాకారులతో ప్రధాని మోదీ భేటీ.. వీక్షించాలంటూ ట్వీట్..