AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ప్రయత్నించండి.. పతకం అదే వస్తుంది.. పారా అథ్లెట్లకు ధైర్యం నింపిన ప్రధాని మోడీ!

పారా ఒలింపిక్స్‌ కోసం భారత దేశం నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ బయలుదేరనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.

PM Narendra Modi: ప్రయత్నించండి.. పతకం అదే వస్తుంది.. పారా అథ్లెట్లకు ధైర్యం నింపిన ప్రధాని మోడీ!
Pm Modi Interacts With Indian Contingent
Balaraju Goud
|

Updated on: Aug 17, 2021 | 2:29 PM

Share

Tokyo Paralympics 2020:పారా ఒలింపిక్స్‌ కోసం భారత దేశం నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ బయలుదేరనుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన క్రీడాకారులని అభినందించారు. టోక్యోలో పారా ఒలింపిక్స్‌ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్‌ 5వరకు జరగనున్నాయి. 54 మంది పారా అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. అయితే, పారా ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారని పేర్కొంది క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది.

పారా ఒలింపిక్స్‌ – 2020 కోసం భారత్‌ నుంచి 54 మంది అథ్లెట్ల బృందం జపాన్‌ వెళ్లనుంది. ఈ సందర్భంగా వారితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. పారా అథ్లెట్లు జపాన్‌లో మరోసారి సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. వీరంతా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లంటూ పేర్కొన్నారు. టోక్యోలో పారా ఒలింపిక్స్‌ పోటీలు ఈ నెల 24 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు జరగనున్నాయి. భారత్‌ నుంచి 54 మంది పారా అథ్లెట్ల బృందం టోక్యోకు వెళ్తుండగా.. ఈ అథ్లెట్లు తొమ్మిది రకాల పోటీల్లో ప్రాతినిథ్యం వహించనున్నారు. మొదటగా.. ఆగస్టు 27న భారత క్రీడాకారులు అర్చరీ ఈవెంట్‌లో పాల్గొననున్నారు. కాగా.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంత పెద్ద మొత్తంలో క్రీడాకారులు పాల్గొంటుండడం ఇదే తొలిసారని క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీతోపాటు.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సైతం పాల్గొన్నారు.

ఈ నేప‌థ్యంలో ప్రధాని మోదీ అథ్లెట్లతో మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారి మీ క‌ష్టాల‌ను రెట్టింపు చేసింది. అయినా మీరు మీ ఆట‌ల‌ను, సాధ‌న‌ను వ‌దులుకోలేదు. అస‌లైన క్రీడాకారుల‌కు ఉండాల్సిన ల‌క్షణం ఇదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. పారాలింపిక్స్‌లో మీ విజ‌యాలు, మీరు సాధించ‌బోయే ప‌త‌కాలు దేశానికి ఎంతో ముఖ్యం. కానీ ఈ న‌వ భార‌త‌దేశం ప‌త‌కాలు సాధించుకు రావాలంటూ మీపై ఎప్పుడూ ఒత్తిడి చేయ‌దు. ముందుగా మీరు మీ ప్రతిభ‌ను నూటికి నూరు శాతం ప్రద‌ర్శించండి. ప‌త‌కం వ‌స్తుందా.. రాదా.. అనేది త‌ర్వాత విష‌యం అని ప్రధాని ఆట‌గాళ్లకు భరోసా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా గుజ‌రాత్‌కు చెందిన‌ పారా-బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పారుల్ ద‌ల్‌సుఖ్‌భాయ్ పార్మర్‌తో ప్రధాని మాట్లాడారు.

మీకు మ‌రో రెండేళ్లలో 50 ఏండ్ల వ‌య‌సులో అడుగ‌పెట్టబోతున్నారు. ఇప్పటిదాకా మీరు మీ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం కోసం చాలా క‌ష్టప‌డ్డారు. ఈ రాఖీ పండుగ‌కు మీరు త‌ప్పకుండా మీ సోద‌రుడికి బ‌హుమ‌తి ఇస్తార‌ని (పారాలింపిక్స్‌లో ప‌త‌కం సాధిస్తార‌ని) అనుకుంటున్నా అని ప్రధాని ద‌ల్‌సుఖ్‌భాయ్ పార్మర్‌తో వ్యాఖ్యానించారు.

కాగా.. ఇటీవల టోక్యో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్స్ భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చారు. ఈ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలవగా.. మీరాబాయి, రవి దహియా రజత పతాకాలు, పీవీ సింధు, లవ్లీనా, బజ్‌రంగ్‌ పునియా కాంస్య పతకాలు సాధించారు. దీంతోపాటు.. పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

Read Also…  తెలంగాణ పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. ఇంతకీ అసలు టార్గెట్ ఎవరు?

Pawan Kalyan: ‘హరి హర వీర మల్లు’లోని ‘పంచమి’ని పరిచయం చేసిన చిత్ర బృందం.. ఫ్యాన్స్‌లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?