Afghanistan Crisis: ఆఫ్ఘన్‌లో మళ్ళీ తాలిబన్ల అరాచక రాజ్యం.. భారత్‌కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందా?

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికార మార్పిడి దాదాపు పూర్తయింది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న దేశాల ప్రయత్నాలు తీవ్ర ఎదురుదెబ్బకు గురయ్యాయి. వీటిలో అమెరికా, నాటో దేశాలతోపాటు భారత్ కూడా ఉంది.

Afghanistan Crisis: ఆఫ్ఘన్‌లో మళ్ళీ తాలిబన్ల అరాచక రాజ్యం.. భారత్‌కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందా?
Afghanistan Crisis
Follow us

|

Updated on: Aug 17, 2021 | 3:20 PM

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన మరోసారి వచ్చింది. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. అధికార మార్పిడి దాదాపు పూర్తయింది. దీనితో పాటు, గత 20 సంవత్సరాలుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న దేశాల ప్రయత్నాలు తీవ్ర ఎదురుదెబ్బకు గురయ్యాయి. వీటిలో అమెరికా, నాటో దేశాలతోపాటు భారత్ కూడా ఉంది. భారతదేశానికి రాబోయే సమయం చాలా క్లిష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో భారతదేశానికి ఉన్న దౌత్యపరమైన సంబంధాలు ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ తాజా పరిస్థితులతో అత్యధికంగా ప్రభావితమయ్యే ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఉంది.

ఇండియా-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు ఎలా మారబోతున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి భారతదేశం ఖర్చు చేసిన దాని పరిస్థితి ఏమిటి? చాబహార్ ప్రాజెక్ట్ ఏమవుతుంది? జైష్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో మళ్లీ తల ఎత్తగలవా? ఈ విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఒకసారి పరిశీలన చేద్దాం..

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ అధికారంతో భారతదేశంపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన కబీర్ తనేజా మీడియాతో మాట్లాడుతూ,  ఈ మార్పు భారతదేశంలో ఇప్పటికిప్పుడు గణనీయమైన ప్రభావాన్ని చూపదు. భారతదేశం ప్రస్తుతం వేచి ఉండాల్సిన పరిస్థితిలో ఉంది. గత నాలుగు-ఐదు రోజులలో, భారతదేశం ఎవరికీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనను జారీ చేయలేదు. ఈ విషయంపై భారతదేశం ఇంతవరకు ఏమీ చెప్పలేదు. రాబోయే కాలంలో తాలిబన్లతో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ తీసుకునే నిర్ణయం మీదే పరిస్థితి ఎలా ఉంటుందనేది అంచనా వేయగలం.

మాజీ విదేశాంగ కార్యదర్శి వివేక్ కట్జూ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై భారతదేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ”ఇది గ్రౌండ్ రియాలిటీని ప్రభావితం చేయదు. ఆగస్టు 12 న దోహాలో జరిగిన సమావేశంలో, భారతదేశం దౌత్యపరంగా ఏ ఒక్క పక్షంతోనూ నిలబడకుండా ఒంటరిగా నిలిచింది.” అని చెప్పారు.

రాబోయే కాలంలో, ఆఫ్ఘనిస్తాన్‌ విషయంలో  భారతదేశం పరిస్థితి  క్లిష్టంగా ఉండవచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. అమెరికాకు భారతదేశం దగ్గరగా ఉండటం.. పాలసీలో కొన్ని లోపాలు ఇందుకు దీనికి కారణంగా వారు చెబుతున్నారు.

గత 20 ఏళ్లలో ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది?

ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం పెట్టుబడి పెట్టలేదనీ, అది సహాయం మాత్రమే అని కబీర్ తనేజా చెప్పారు. భారత్ అక్కడ ఖర్చు చేసిన3 బిలియన్ డాలర్లు.. తిరిగి రాబట్టుకోవడానికి చేసింది లేదా ఏ వ్యక్తికో ఇచ్చింది కాదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం చేసిన సహాయం. ఆ సాయం ఏమవుతుందో చెప్పడం కష్టం. గత 20 సంవత్సరాలలో, ఆఫ్ఘనిస్తాన్‌లో భారతదేశం దాదాపు 500 చిన్న, పెద్ద ప్రాజెక్టులపై ఖర్చు చేసింది. వీటిలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, పిల్లల హాస్టల్‌లు, వంతెనలు వంటివి ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ హౌస్, సల్మా డ్యామ్, జరంజ్-దేలారం హైవే వంటి ప్రాజెక్టుల కోసం భారతదేశం చాలా ఖర్చు చేసింది. తాలిబాన్లు అంత భారీ సాయాన్ని పూర్తిగా నాశనం చేస్తారని అనిపించడం లేదు. ఇది కాకుండా, చిన్న స్థాయిలో ఉన్న సహాయం గురించి ఏమీ చెప్పలేము. కానీ తాలిబాన్ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు ఉపయోగపడతాయని మనం ఆశించవచ్చు. అదే సమయంలో, తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా, పాకిస్తాన్ జోక్యం పెరుగుతుందని కొందరు నిపుణులు అంటున్నారు. ఆ మాట ఎలా వున్నా ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ జోక్యాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఈ రెండు దేశాలు కోరుకుంటున్నాయనేది మాత్రం వాస్తవం.

తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చాబహార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమవుతుంది?

ఇరాన్ చాబహార్ పోర్టు భారతదేశాన్ని ఆఫ్ఘనిస్తాన్‌తో, ఇరాన్‌ను మధ్య ఆసియా దేశాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌తో ప్రత్యక్ష వాణిజ్య మార్గాన్ని రూపొందించాలని భారత్ కోరుకుంది. ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటో ఇప్పుడు చెప్పడం చాలా కష్టమని తనేజా చెప్పారు. కానీ రాబోయే సంవత్సరాలు భారతదేశానికి అంత సులభం కాదు. రాబోయే కాలంలో, ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్యం కరాచీ, గ్వదార్ పోర్టుల ద్వారా చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, చాబహార్ పోర్టులో భారతదేశ పెట్టుబడి అసాధ్యమైనది కావచ్చు.

జైషే, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ప్రత్యేకించి కాశ్మీర్‌లో తాలిబాన్ల రాకతో మళ్లీ క్రియాశీలకంగా మారగలవా?

ఆఫ్ఘనిస్తాన్ అధికారంలో ముల్లా బరదార్‌కు ముఖ్యమైన స్థానం లభిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది. బరదర్ చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్ జైలులో ఉన్నాడు. అతనికి పాకిస్తాన్ నుంచి బలమైన మద్దతు ఉంది. అటువంటి పరిస్థితిలో, జైష్, లష్కర్ వంటి సంస్థలు ఆఫ్ఘనిస్తాన్ వచ్చి శిక్షణ పొందాలనుకుంటే, అది వారికి అంత కష్టం కాదు. తాలిబాన్ యోధులు అమెరికా, నాటో దేశాలతో యుద్ధరంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి వారు కూడా దాని నుండి ప్రయోజనం పొందుతారు. ఈ పరిస్థితులన్నీ భారతదేశానికి తీవ్రమైన ముప్పు కలిగించే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను కలిగించే పరిస్థితిని కొట్టిపారేయలేము.

ఈ సవాలును ఎదుర్కోవడానికి భారతదేశానికి ఉన్న మార్గం ఏమిటి?

ఈ విషయంలో భారతదేశానికి పెద్దగా మార్గాలేమీ లేవు. తాలిబన్లతో సంబంధాలు ఎలా ఉండాలో రాబోయే కొన్ని వారాలు లేదా నెలల్లో భారత్ నిర్ణయించుకోవాలి. భారతదేశం ప్రత్యక్ష సంబంధాలను కొనసాగిస్తుందా లేదా సెమీ అధికారికంగా ఉంటుందా? లేదా బ్యాక్ డోర్ దౌత్యం ఉంటుందా? అనే విషయాలు నిర్ణయం కావాలి. అయితే, ఈ నిర్ణయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది.

తాలిబాన్ ఎప్పుడు, ఎలా ఏర్పడింది?

1980ల చివరలో, 1990ల ప్రారంభంలో ఆఫ్ఘన్ గెరిల్లా యోధులు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సోవియట్ యూనియన్ (1979-89) ఆక్రమించిన కాలం ఇది. ఈ యోధులకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతు ఇచ్చాయి.

ఆఫ్ఘన్ యోధులతో పాటు, పాష్టో గిరిజన విద్యార్థులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. ఈ వ్యక్తులు పాకిస్తాన్ మదరసాలలో చదువుకునేవారు. పాష్టోలో విద్యార్థులను తాలిబాన్ అంటారు. ఇక్కడ నుండి వారికి తాలిబాన్ అనే పేరు వచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో పష్టున్‌లు ఎక్కువ. దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వారికి మంచి పట్టు ఉంది. అదే సమయంలో, పాకిస్తాన్  ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో మెజారిటీ పష్టున్లు ఉన్నారు.

సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టిన తర్వాత, ఈ ఉద్యమానికి ఆఫ్ఘనిస్తాన్‌లోని సాధారణ ప్రజల మద్దతు లభించింది. ఉద్యమం ప్రారంభంలో, దానిని నడిపిన పోరాట యోధులు అధికారంలోకి వచ్చిన తర్వాత, దేశంలో శాంతి, భద్రత ఏర్పాటు అవుతాయిని హామీ ఇచ్చారు. దీనితో పాటు, షరియా చట్టం కఠినంగా అమలు చేయస్తామని చెప్పారు.

తమ ప్రత్యర్థి ముజాహిదీన్ గ్రూపుతో నాలుగు సంవత్సరాల పోరాటం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చేతుల్లోకి వచ్చింది. దీనితో పాటు, దేశంలో కఠినమైన షరియా చట్టం అమలులోకి వచ్చింది. తాలిబాన్లు 1994 లో కాందహార్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 1996 లో కాబూల్ స్వాధీనం చేసుకోవడంతో, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌పై పూర్తి నియంత్రణ సాధించింది. అదే సంవత్సరంలో, తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించింది. ముల్లా మహ్మద్ ఉమర్‌ను అమీర్-అల్-మోమినిన్ అనగా దేశ కమాండర్‌గా నియమించారు.

2001 కి ముందు, ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో 90% తాలిబాన్ నియంత్రణలో ఉంది. ఈ కాలంలో షరియా చట్టం ఖచ్చితంగా అమలు చేశారు. మహిళలు బురఖా ధరించాలని కోరారు. సంగీతం, టీవీల పై నిషేధం విధించారు. పొట్టి గడ్డాలు ఉన్న పురుషులను జైలులో పడేశారు. ప్రజల సామాజిక అవసరాలు, మానవ హక్కులు కూడా ఆ సమయంలో పూర్తిగా విస్మరించారు.

Also Read: Heartbreaking Video: మా బాధను ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న ఆఫ్ఘన్ యువతి.. వీడియో

Afghanistan Crisis: ఆప్ఘనిస్థాన్ వార్.. మనదేశ వాణిజ్యంపై ప్రభావం.. ఏయే వస్తువుల ధరలు పెరగనున్నాయంటే

SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా