Heartbreaking Video: మా బాధను ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న ఆఫ్ఘన్ యువతి.. వీడియో

Heartbreaking video of Afghan Girl: ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగాన్ని తాలిబాన్లు వశపరుచుకోవడంతో ఆ దేశమంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు

Heartbreaking Video: మా బాధను ఎవరూ పట్టించుకోరు.. కంటతడి పెట్టిస్తున్న ఆఫ్ఘన్ యువతి.. వీడియో
Heartbreaking Video Of Afghan Girl
Follow us

|

Updated on: Aug 17, 2021 | 2:27 PM

Heartbreaking video of Afghan Girl: ఆఫ్ఘనిస్థాన్‌ భూభాగాన్ని తాలిబాన్లు వశపరుచుకోవడంతో ఆ దేశమంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. తాలిబాన్ల చేతిలో చావడం కంటే.. దేశం విడిచి వెళ్లడమే ఏకైక మార్గమంటూ ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా దేశం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడ చూసినా ప్రజల హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇక మహిళలైతే తమ ఆఫ్ఘన్‌లో తమకు రక్షణ లేదని.. ఇంకా తమ జీవితమంతా నాలుగు గోడల మధ్య బంధీ కావాల్సిందేనంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితం ప్రమాదంలో పడిందని.. తమను కేవలం లైంగిక బానిసల్లాగానే చూస్తారని రోదిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రజలు తాలిబాన్ల నుంచి తమ ప్రాణ, మానాలను కాపాడుకునేందుకు ఇతర దేశాలకు తమ పిల్లలతో పరుగులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ నుంచి హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ మాన, ప్రాణాలకు ఇక విలువ లేదంటూ యువతులు విలపిస్తున్నారు. తాజాగా ఆఫ్ఘన్‌కు చెందిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

తాము ఆప్ఘనిస్థాన్‌లో జన్మించడం వల్ల ఎవరూ తమను లెక్కచేయరంటూ ఆ యువతి కన్నీళ్లు పెట్టుకుటుంది. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.. చరిత్రలో తాము నెమ్మదిగా కనుమరుగవుతామంటూ కన్నీరుమున్నీరవుతుంది. తమ పరిస్థితిని ఎవరూ పట్టించుకోరని.. కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నానని పేర్కొంటుంది. కాగా.. ఈ వీడియో ఆఫ్ఘాన్ మహిళల పరిస్థితులకు అద్దం పడుతోంది. దీనిని చూసినవారంతా ఆఫ్ఘన్ ప్రజల బాధ వర్ణనాతీతమని పేర్కొంటున్నారు. ఇప్పటికే చాలామంది ఈ వీడియోను షేర్ చేసి.. ఆ యువతి బాధ వర్ణనాతీతమని పేర్కొంటున్నారు. ఆఫ్ఘన్ మహిళల పరిస్థితులను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజా వీడియో ఆఫ్ఘన్ మహిళల పరిస్థితులకు అద్దంపడుతుందంటూ పేర్కొంటున్నారు.

వైరల్ వీడియో.. 

కాగా.. ఇప్పటికే తాలిబాన్లు బాలికలను పాఠశాలలకు పంపవద్దని, తాలిబాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ హుకూం జారీ చేశారు. దీంతోపాటు బురఖా ధరించాలని, బయటకు వచ్చేటప్పుడు పురుషుని తోడుతో రావాలని హెచ్చరించారు. అంతేకాకుండా కఠినమైన షరియత్ చట్టాలను అవలంభించకుంటే.. కఠిన చర్యలు తప్పవంటూ ఆదేశాలిచ్చారు. కాగా.. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో.. బాలికలు, యువతులు, పెళ్లికాని మహిళల పేర్లు సేకరించాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆఫ్ఘన్‌లోని మహిళలు, బాలికలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాల వైపు పరుగులు తీస్తు్న్నారు. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో తమ జీవితం మళ్లీ అంధకారంలోకే వెళుతుందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Asaduddin Owaisi: ఆప్ఘన్ తాలిబాన్లతో చర్చలు జరపాలి.. భారత ప్రభుత్వానికి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్

Afghan Woman Mayor : ‘నేనిక్కడ వెయిట్ చేస్తున్నా..నన్ను చంపండి’.. తాలిబన్లకు ఆఫ్ఘన్ తొలి మహిళా మేయర్ ‘పిలుపు’