Asaduddin Owaisi: ఆప్ఘన్ తాలిబాన్లతో చర్చలు జరపాలి.. భారత ప్రభుత్వానికి అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్
Asaduddin Owaisi on Afghanistan Taliban: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు వశపరుచుకోవడంతో ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులపై
Asaduddin Owaisi on Afghanistan Taliban: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబాన్లు వశపరుచుకోవడంతో ఆ దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోని పలు దేశాలు ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అయితే.. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం అవలంభిచబోయే వైఖరిని వెల్లడించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఎప్పుడో స్పందించాల్సిందని.. ప్రస్తుతం ఈ విషయంలో ఏం చేయబోతున్నారంటూ అసదుద్దీన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత ప్రభుత్వం మూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేసి పార్లమెంట్, జలాశయం నిర్మించిందని ఒవైసీ గుర్తుచేశారు. ఇప్పుడు ఆ అభివృద్ధి అంతా వృథా అయిపోయిందన్నారు. తాలిబన్లు, జైషే మహ్మద్, అల్‌ఖైదా ఉగ్రవాదుల గురించి భారత ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. ఆఫ్ఘనిస్థాన్‌కు భారత ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చిందో మోదీ చెప్పాలన్నారు. ఆ సంస్థలతో భవిష్యత్తులో భారతదేశానికి సమస్య తలెత్తుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు.
అల్‌ఖైదా, ఐసిస్ హెడ్‌క్వార్టర్లను ఆఫ్ఘనిస్థాన్‌కు మార్చారని, ఈ విషయంలో మోదీ ఇంతవరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఆఫ్ఘనిస్థాన్ పున:నిర్మాణం కోసం భారత్ 3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం తాలిబాన్లను గుర్తించినా, గుర్తించకపోయినా.. వారితో చర్చలు జరపాలని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సమయం మించిపోయిందని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే అంతర్జాతీయ భద్రతా నిపుణులందరూ తాలిబాన్లతో చర్చలు జరపాలని ఒవైసీ కోరారు. ఇదే విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తినప్పుడు తనను చాలామంది వెక్కరించారని.. ఇప్పుడు ప్రభుత్వానికి అర్థమైందంటూ విమర్శించారు. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఏం చేయబోతుందో స్పష్టంచేయాలంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
నూర్ మొహమ్మద్, TV9 రిపోర్టర్, హైదరాబాద్
Whether or not India recognises #Taliban, govt should have opened dialogue with Taliban: Asaduddin Owaisi #Hyderabad #Afghanistan @aimim_national https://t.co/5S6z6tnoaB
— Pramod Chaturvedi (ANI) ?? (@PramodChturvedi) August 17, 2021
Also Read: