Overloaded but airborne: పల్లె బస్సుకన్నా దారుణం..అమెరికా విమానంలో కిక్కిరిసిన జన సందోహం..
కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్న ఆర్సీ హెచ్ 871 విమానాన్ని చూస్తే దానికన్నా పల్లె బస్సు నయమనిపిస్తుంది. కాబూల్ లోని అమెరికన్ ఎంబసీ నుంచి సిబ్బందిని, 150 మంది సైనికులను తీసుకువెళ్ళడానికి తరలించేందుకు ఇక్కడ చేరుకున్న ఈ ప్లేన్ లో వందలకొద్దీ ఆఫ్ఘన్లు, విదేశీయులు...
కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లనున్న ఆర్సీ హెచ్ 871 విమానాన్ని చూస్తే దానికన్నా పల్లె బస్సు నయమనిపిస్తుంది. కాబూల్ లోని అమెరికన్ ఎంబసీ నుంచి సిబ్బందిని, 150 మంది సైనికులను తీసుకువెళ్ళడానికి తరలించేందుకు ఇక్కడ చేరుకున్న ఈ ప్లేన్ లో వందలకొద్దీ ఆఫ్ఘన్లు, విదేశీయులు ఎక్కేశారు. సిబ్బంది నివారించేలోగా వారిని తోసుకుంటూ విమానంలోకి జంప్ చేశారు. సుమారు 800 మంది ఇలా విమానం ఎక్కి ఉంటారని మొదట అంచనా వేసినా.. ఆ తరువాత వీరి సంఖ్య 640 అని తేలింది. వీరంతా విమానం కిందే కూర్చున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ శరాణార్థులను టెక్సాస్, విస్కాన్ సిన్ నగరాలలోని వైమానిక స్థావరాలకు తరలిస్తామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. నిన్న కాబూల్ విమానాశ్రయంలో మొత్తం 8 మంది మరణించినట్టు ఈ శాఖ అధికారులు తెలిపారు. అమెరికా దళాల కాల్పుల్లో ఇద్దరు, విమానం వెళ్తుండగా జారీ కిందపడి ముగ్గురు, ఇతర సంఘటనల్లో మరో ముగ్గురు మృతి చెందారని వారు చెప్పారు. అమెరికా నుంచి ఇప్పటివరకు రెండు విమానాలు కాబూల్ చేరుకోగా మంగళవారం మరికొన్నింటిని పంపనున్నట్టు అధికారులు తెలిపారు.
ఇలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అధ్యక్షుడు జోబైడెన్ అనుసరించిన పాలసీని అంమెరికాలోనే పత్రికలు దుయ్యబడుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు కూడా ఆయనను నెత్తికెత్తుకున్న ఈ పత్రికలు .. ఈ ఆధునిక చరిత్రలో ఇది అత్యంత సిగ్గు చేటైన నిర్ణయమని పేర్కొన్నాయి. బైడెన్ ఏకపక్ష నిర్ణయాన్ని తప్పు పట్టాయి. తన చేతుల్ని ఆయన ఇలా కడిగేసుకున్నాడని అభివర్ణించాయి. ఇటీవలి కాలంలో బైడెన్ వ్యవహార శైలిని మీడియా విమర్శించడం ఇదే మొదటిసారి. అయితే కాబూల్ విమానాశ్రయం వద్ద పరిస్థితి ముందే ఊహించింది కాదని, ఇదివైఫల్యం ఎంత మాత్రం అసలు కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. 2013 లో ఫిలిప్పీన్స్ లో తుఫాను బారి నుంచి వందలమంది ప్రజలను రక్షించేందుకు ఇలాగే విమానాలను వినియోగించడం జరిగిందన్నారు. ఇలా ఉండగా జనరల్ కెనెత్ ఎఫ్ మెహేండ్ జూనియర్… ఖతార్ లో తాలిబన్ ప్రతినిధులతో మాట్లాడుతూ .. కాబూల్ నుంచి అమెరికన్ల సురక్షిత తరలింపులో సహకరించాలని కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి : జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్ ఫోన్..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్… ఐటీ రిటర్న్స్ పత్రాలు లేకపోయినా హౌస్ లోన్ గ్యారంటీ..!:ICICI Home Finance Video.