china: ఆఫ్గనిస్తాన్ మళ్ళీ ఉగ్రవాద ‘స్థావరం’ కారాదు.. తాలిబన్లకు చైనా హెచ్చరిక..

ఆఫ్గనిస్తాన్ మళ్ళీ 'ఉగ్రవాదులకు స్థావరం' కారాదని తాలిబన్లను చైనా హెచ్చరించింది. వారు అరమరికలు లేని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని తాము ఆశిస్తున్నామని ఐక్యరాజ్య సమితిలో చైనా....

china: ఆఫ్గనిస్తాన్ మళ్ళీ ఉగ్రవాద 'స్థావరం' కారాదు.. తాలిబన్లకు చైనా హెచ్చరిక..
Afghan Must Never Again Become Haven For Terrorists Says China
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 17, 2021 | 4:03 PM

ఆఫ్గనిస్తాన్ మళ్ళీ ‘ఉగ్రవాదులకు స్థావరం’ కారాదని తాలిబన్లను చైనా హెచ్చరించింది. వారు అరమరికలు లేని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని, అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని తాము ఆశిస్తున్నామని ఐక్యరాజ్య సమితిలో చైనా ఉప (డిప్యూటీ) శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ అన్నారు. ఆఫ్ఘన్ పరిస్థితిపై ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆఫ్ఘన్ టెర్రరిస్టులకు స్వర్గధామం కారాదని ఆ దేశంలో భవిష్యత్తులో కుదిరే రాజకీయ పరిష్కారానికి ఇదే ప్రాతిపదిక కావాలని చెప్పారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను తెంచుకోవాలని ఆయన సూచించారు. తాలిబన్లు తాము లోగడ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్ పరిణామాలను అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి టెర్రరిస్టు సంస్థలు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాల్సి ఉందన్నారు. అన్ని దేశాలు తమ బాధ్యతలను అంతర్జాతీయ చట్టాలు, భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా నిర్వరిస్తాయని ఆశిస్తున్నామని గెంగ్ షువాంగ్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా హడావుడిగా తన సైనిక దళాలను ఉపసంహరించుకోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు.

చైనా విదేశాంగ శాఖ మహిళా అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ కూడా బీజింగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలకు, క్రిమినల్ చర్యలకు తాలిబన్లు దూరంగా ఉండాలని ఆమె కోరారు. ఆఫ్ఘన్ ప్రజలు తమ మాతృభూమిని పునర్నిర్మించుకోవడానికి తాలిబన్లు వారికి సహకరించాలన్నారు. తాలిబన్లతో పొలిటికల్ సెటిల్మెంట్ కుదుర్చుకునేందుకు చైనా కృషి చేస్తుందని ఆమె తెలిపారు. అప్పటివరకు తాము ఆ ప్రభుత్వాన్ని గుర్తించే అవకాశాలు లేవని ఆమె పరోక్షంగా పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : ఈ చిన్నారి ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో గెస్ చెయ్యగలరా ..?:Celebrity Baby Picture Video.

 గుండు చేయించుకొని మరి రజినీకాంత్ ని పెళ్ళికి ఒప్పించింది… తలైవా పెళ్లికి ట్వీస్ట్‌లు మీద ట్వీస్ట్‌లు:Rajinikanth Love story video.

 బైక్ నడుపుతూ.. ఇదేం ఓవర్ యాక్షన్ రా బాబు !అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంటారు..:Bike Viral Video.

 జియో సంచలనం.. రూ. 4 వేలకే స్మార్ట్‌ ఫోన్‌..!ఫీచర్స్ ఇలా .. :JIO Phone for 4k video.