Statue of Maharaja Ranjit Singh: మహారాజా రంజిత్‌సింగ్ విగ్రహం ధ్వంసం.. లాహోర్‌లో తాలిబన్ శిష్యుల అరాచకం..
ఇద్దరు నిందితులు వికలాంగుడు, సహాయకుడిగా కోటలోకి ప్రవేశించారు. ముందుగా వికలాంగుడిగా నటిస్తూ నిందితుడు మొదట విగ్రహాన్ని కర్రతో విగ్రహాన్ని కొట్టాడు.
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అరాచకం సృష్టిస్తుంటే పాకిస్తాన్‌లో వాళ్ల శిష్యులు వారి మించిపోతున్నారు. మరిన్ని దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతుకు మించిన స్థాయిలో ఘోరాలకు తెగబడుతున్నారు. లాహోర్‌లో మహరాజా రంజింత్‌సింగ్ విగ్రహాన్ని ముష్కరులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. తెహ్రీకే లబ్బాక్ సంస్థకు చెందిన ఓ కార్యకర్త రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. సిక్కు సామ్రాజ్యానికి సాక్ష్యమైన రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న లాహోర్ కోటలో మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని మరోసారి తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం లాహోర్ నగరంలో మూడవసారి మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ అనే రాడికల్ గ్రూప్ సభ్యులు విగ్రహంపై దాడి చేసి.. విగ్రహాన్ని కూల్చివేశారు. అయితే, ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. దాడి చేసిన నిందితులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని తెహ్రీక్-ఇ-లబ్బైక్ సభ్యులు ఇద్దరు ధ్వంసం చేశారు. ఈ కేసులో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు నిందితులు వికలాంగుడు, సహాయకుడిగా కోటలోకి ప్రవేశించారు. ముందుగా వికలాంగుడిగా నటిస్తూ నిందితుడు మొదట విగ్రహాన్ని కర్రతో విగ్రహాన్ని కొట్టాడు. ఈ పనిలో మరొక వ్యక్తి అతనికి సహాయం చేశాడు. ఈ దాడిలో విగ్రహం పూర్తిగా ధ్వంసం అయ్యింది.
#Shameful this bunch of illiterates are really dangerous for Pakistan image in the world https://t.co/TXoAXCQtWW
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 17, 2021
పదేపదే టార్గెట్..
2019లో లాహోర్‌లో రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముష్కరులు ఈ విగ్రహాన్ని పదేపదే టార్గెట్ చేస్తున్నారు. అయినప్పటికి పాక్ ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. గతంలో మూడుసార్లు మహరాజా రంజిత్‌సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాజాగా టీఎల్‌పీ సంస్థకు చెందిన కార్యకర్త ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీనిపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. లాహోర్ రాజధానిగా సిక్కు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు రంజిత్‌సింగ్. ఆయన్ను సిక్కుల ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఈ విగ్రహాన్ని వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ (WCLA) యుకె ఆధారిత సిక్కు హెరిటేజ్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించారు.
మహారాజా సింగ్ పంజాబ్‌ను 40 సంవత్సరాలు పాలించారు
తొమ్మిది అడుగుల విగ్రహాన్ని మహారాజా 180 వ వర్ధంతి సందర్భంగా జూన్ 2019 లో లాహోర్ కోటలో ఆవిష్కరించారు. సిక్కు సామ్రాజ్యం మొదటి మహారాజా సింగ్ పంజాబ్‌ను సుమారు 40 సంవత్సరాలు పాలించారు. అతను 1839 లో మరణించాడు. మహారాజా రంజిత్ సింగ్, షేర్-ఇ-పంజాబ్ గా ప్రసిద్ధి చెందారు, పంజాబ్ ప్రాంతంలో సిక్కు సామ్రాజ్యాన్ని 19 వ శతాబ్దం ప్రారంభంలో పాలించారు. రంజిత్ సింగ్ విగ్రహం చల్లని కాంస్య లోహంతో తయారు చేయబడింది. ఇందులో మహారాజా రంజిత్ సింగ్ గుర్రంపై కూర్చొని చేతిలో కత్తితో కనిపిస్తారు. ఫకీర్ ఖానా మ్యూజియం మార్గదర్శకత్వంలో స్థానిక కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
గత కొద్ది రోజుల క్రితమే…
పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల హిందూ దేవాలయంపై దుండగులు దాడి ఘటన తెలిసిందే… రహీం యార్ ఖాన్ జిల్లాలోని భోంగ్ సిటీలో సిద్ధివినాయక టెంపుల్ లోకి ప్రవేశించి నానా బీభత్సానికి పాల్పడ్డారు. ఈ సిటీవాసులను రెచ్చగొట్టేట్టుగా ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వారి ఆగ్రహానికి అంతు లేకపోయింది. గుంపులు..గుంపులుగా ఆలయంలోకి చొచ్చుకు వచ్చి విధ్వంస కాండకు దిగారు. ఇనుప రాడ్లు, కర్రలు, బండరాళ్లతో వస్తువులను, విగ్రహాలను ధ్వంసం చేశారు. పవిత్ర గ్రంథాలకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు, ఈ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 100 హిందూ కుటుంబాలను రక్షించేందుకు పాకిస్థాన్ రేంజర్లను ప్రభుత్వం పంపింది. పాలక పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ కి చెందిన డాక్టర్ రమేష్ కుమార్ వాంక్వానీ.. ఈ ఘోరం తాలూకు దృశ్యాల వీడియోను తన ట్వీట్లకు జోడిస్తూ..దీన్ని తక్షణమే నిలపాలని పోలీసులను, అధికారులను కోరారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని, స్థానిక పోలీసులు ఉన్నా దీన్ని ఆపేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఉదాసీనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన తర్వాత లాహోర్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో నిలిచిపోయిన విమానాల రాకపోకలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులు!