Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో నిలిచిపోయిన విమానాల రాకపోకలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులు!

అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.. అఫ్గానిస్థాన్ రాజధాని నగరంలో ఇతర దేశాలకు చెందిన చాలా మంది ఇరుక్కుపోయారు.

Afghanistan Crisis: అఫ్ఘానిస్తాన్‌లో నిలిచిపోయిన విమానాల రాకపోకలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్న భారతీయులు!
Afghanistan Crisis
Follow us

|

Updated on: Aug 17, 2021 | 7:18 AM

అఫ్గానిస్తాన్ ను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే.. అఫ్గానిస్థాన్ రాజధాని నగరంలో ఇతర దేశాలకు చెందిన చాలా మంది ఇరుక్కుపోయారు. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లోని ఎయిర్ పోర్ట్ రణరంగంగా మారింది. ఆ దేశాన్ని విడిచిపెట్టి స్వదేశానికి పయనమవుతున్న విదేశీలతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఎక్కేందుకు జనం పరుగులు పెట్టారు. ఆఫ్ఘన్ ఎయిర్ స్పేస్ మూతపడింది. ఎయిర్ పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు నిలిపివేశారు. ఎయిర్ స్పేస్ మూసివేసిన కారణంగా నిలిచిన ఎయిరిండియా సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికా నుంచి భారత్ వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. షికాగో-న్యూఢిల్లీ (AI-126), శాన్‌ఫ్రాన్సిస్కో-న్యూఢిల్లీ (AI-174) విమానాలను గల్ఫ్ దేశాల మీదుగా రీ-ఫ్యూయలింగ్ చేసి భారత్‌కు తరలిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్ మీదుగా ప్రయాణించే అనేక విమానాల దారిమళ్లిస్తున్నారు. దీంతో అఫ్ఘాన్‌లో భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు చిక్కుకున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఎటు కదలలేక ఇబ్బందులు పడుతున్న భారతీయుల కష్టాలు వర్ణానాతీతంగా మారాయి. భారత్ తిరిగి వెళ్లేందుకు సహాయం కోరుతూ కొందరు అధ్యాపకులు వేడుకుంటున్నారు. అటు రాజధాని కాబూల్‌లో నివశించే ఓ భారత వ్యక్తి పెట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కాబూల్‌లో చిక్కుకున్నానని, ఎలా బయటకు రావాలో తెలియడం లేదని ఆ వీడియోల ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ చిక్కుకున్న భారతీయులను ఎలాగైనా కాపాడాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. గురు నాయక్‌ అనే వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ వేదికగా షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వీడియోలో.. ‘రెండు ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. అయితే విమానాల రాకపోకలను నిషేధించడంతో ఆ రెండు టికెట్లు రద్దయ్యాయి. దీంతో నిన్న రాత్రి కాబూల్‌ విమానాశ్రయం దగ్గరలోని ఓ హోటల్‌లో బస చేశాం. అయితే ఇప్పుడు ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Afghanistan Crisis 1

Afghanistan Crisis 1

ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ వశమైన విషయం తెలిసిందే. రాజధాని కాబూల్ ప్రాంతంలో సైతం తాలిబన్లు తమ జెండా పాతారు. దేశాధ్యక్షుడు దేశం వదిలి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఆ దేశంలోని ఇతర దేశాల ప్రజలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ప్రధానంగా భారతీయులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. అయితే అక్కడ నివసిస్తున్న భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం గత రెండు రోజులుగా ప్రత్యేక విమానాలను నడిపింది. అనేకమందిని దేశానికి తీసుకొచ్చింది.

మరోవైపు… తాలిబన్ వశమైన అఫ్ఘానిస్తాన్ నుంచి అఫ్ఘాన్ హిందువులు, సిక్కులను స్వదేశానికి తీసుకువస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీరితోపాటు అఫ్ఘాన్ భాగస్వాములను కూడా భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని భారత్ చెప్పింది.

Afghanistan Crisis: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులు.. క్షేమంగా తీసుకువస్తాం..విదేశీ వ్యవహారాల శాఖ..

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు.. మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడి జారీ