- Telugu News Business Will Gold Price Increasing By Coming Diwali Festival Market Experts Saying That
Gold Rates: దీపావళి నాటికి బంగారం ధరలు మరింత పెరగనున్నాయా.? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Gold Rates: మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా వారు ఏం చెబుతున్నారంటే..
Updated on: Aug 16, 2021 | 6:18 PM

భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేము. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావించేవారు చాలా మంది ఉన్నారు.

ఇక గత కొన్ని రోజులుగా ఆషాడమాసం కారణంగా తగ్గిన బంగారం ధరలు తాజాగా శ్రావణ మాసంలో మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక గత నెలతో పోల్చితే బంగారం అమ్మకాలు పది శాతం పెరిగాయి.

బంగారం ఇలా పెరగడానికి డాలర్ విలువ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ పడిపోవడంతో ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టే బంగారం ధర ఇలా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,090కి చేరింది. రానున్న రోజుల్లో వివాహాది కార్యక్రమాలతో పాటు దీపావళి ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

డాలర్ విలువ తగ్గడంతో చాలా మంది పెట్టుబడికి తర్వాతి ఆప్షన్‌గా బంగారాన్నే ఎంచుకుంటారని కాబట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకున్నా, భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేయాలనుకున్నా ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి నాటికి తులం బంగారం రూ. 50 వేలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.




