ఆ ఆలయంలో 99 లక్షల 99 వేల 999 దేవతా విగ్రహాలు ఉంటాయి..! కోటికి ఒక విగ్రహం మాత్రం తక్కువగా ఉంటుంది.. ఎందుకో తెలుసా..?
Unakoti Idols: భారతదేశంలో మర్మమైన ప్రదేశాలు, ఆలయాలు చాలా ఉన్నాయి. వాటి రహస్యాలు ఇప్పటికి ఎవరికి తెలియదు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర
Unakoti Idols: భారతదేశంలో మర్మమైన ప్రదేశాలు, ఆలయాలు చాలా ఉన్నాయి. వాటి రహస్యాలు ఇప్పటికి ఎవరికి తెలియదు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర దగ్గరలో ఒక మర్మమైన రాతి విగ్రహాల ఆలయం ఉంది. ఇక్కడ 99 లక్షల 99 వేల 999 రాతి విగ్రహాలు ఉంటాయి. అంటే కోటికి ఒక విగ్రహం తక్కువ అన్నమాట. అయితే ఈ విగ్రహాల రహస్యాలు ఇప్పటి వరకు నిర్దారంచలేదు. ఈ దేవాలయ రహస్యాన్ని పరిష్కరించడానికి చాలా మంది పండితులు వచ్చినప్పటికీ అందరు విఫలమయ్యారు. ఈ ఆలయం రహస్యం ఏమిటంటే ఈ విగ్రహాలను ఎవరు, ఎప్పుడు, ఎందుకు తయారు చేశారు. ఈ ఆలయ వివరాలను ఈ రోజు తెలుసుకుందాం.
ఒకప్పుడు శివుడితో సహా ఒక కోటి దేవతలు ఎక్కడికో వెళ్తున్నారనే ఒక కథ ఉంది. దాని ప్రకారం రాత్రి కాగానే దేవతలందరూ నిద్రపోతారు. శివుడు కూడా నిద్రపోయాడు. కానీ ఉదయం కాగానే ఎవరూ లేవరు. శివుడు మాత్రమే లేస్తాడు. దీంతో అతడికి కోపం వచ్చి అందరిని శపిస్తాడు. దీంతో వారందరూ రాతి దేవతలుగా మారిపోతారు. అందుకే ఇక్కడ 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు ఉంటాయని కొంతమంది అభిప్రాయం. ఈ విగ్రహాల తయారీ గురించి మరో కథ ఉంది. శివుడు, పార్వతితో కలిసి కాలు అనే హస్తకళాకారుడు కైలాస పర్వతానికి వెళ్లాలనుకుంటాడు.
అప్పుడు శివుడు ఒక రాత్రిలో కోటి దేవతలు మరియు దేవతల విగ్రహాలను తయారు చేస్తే అతడిని తనతో పాటుగా తీసుకెళుతానని షరతు పెడుతాడు. అయితే కాలుడికి అది సాధ్యం కాదు ఎందుకంటే కోటికి ఒక విగ్రహం తక్కువగా తయారుచేస్తాడు.ఈ కారణంగా శివుడు ఆ హస్తకళాకారుడిని తనతో తీసుకెళ్లలేదు. అందుకే ఈ ప్రదేశానికి ‘ఉనకోటి’ అని పేరు పెట్టారని కొంతమంది చెబుతున్నారు. ఈ ఆలయం త్రిపుర రాజధాని అగర్తలా నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ స్థలం చాలా సంవత్సరాలుగా ఎవరికి తెలియలేదు. ఇప్పుడు కూడా చాలా మందికి ఈ స్థలం గురించి, ఆలయం గురించి కానీ అస్సలు తెలియదు.