Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ మీదికి ఎగబడ్డ జనాలు.. ఊకో కాకా అన్న ఊరుకోలేదు.. అసలేమైందంటే..

Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ మీదికి ఎగబడ్డ జనాలు.. ఊకో కాకా అన్న ఊరుకోలేదు.. అసలేమైందంటే..

చూడ్డానికి పహిల్వాన్‌‌‌‌లా ఉంటాడు. ఖతర్నాక్‌గా మాట్లాడుతడు.! కిర్రాక్‌ లేసిందో.... కారాలు మిరియాలు నూరుతడు.. గొంతెత్తి పాడుతూ జనాల్ని మంత్రముగ్దులను చేస్తాడు.. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతాడు.

Rajeev Rayala

|

Aug 16, 2021 | 10:01 PM

Rahul Sipligunj : చూడ్డానికి పహిల్వాన్‌‌‌‌లా ఉంటాడు. ఖతర్నాక్‌గా మాట్లాడుతడు.! కిర్రాక్‌ లేసిందో…. కారాలు మిరియాలు నూరుతడు.. గొంతెత్తి పాడుతూ జనాల్ని మంత్రముగ్దులను చేస్తాడు.. నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతాడు. అయన ఎవరో కాదు రాహుల్ సిప్లిగంజ్. తెలుగులో సింగర్‌‌‌‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. త్వరలో హీరోగా మారబోతున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పడే పాటలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక టాలీవుడ్‌‌‌‌లో కూడా ఎన్నో సినిమాలకు అద్బుతమైన పాటలు పాడాడు రాహుల్. ప్రైవేట్ ఆల్బమ్స్‌‌‌తో పాపులార్ అయిన ఈ కుర్రాడు. బిగ్ బాస్‌‌‌‌షోలో  పాటిస్పెట్ చేసి బిగ్ బాస్ 3 విన్నర్‌‌‌‌గా నిలిచాడు. సింగర్‌‌‌‌గానే కాకుండా బిజినెస్ మ్యాన్‌‌‌‌గాను రాణించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఊకో కాకా అనే మెన్స్‌‌‌‌వేర్ బ్రాండ్ స్టోర్‌‌‌‌ను ప్రారంభించాడు. క్రేజీ డైరెక్టర్‌ కృష్ణవంశీ డైరెక్షన్‌‌‌లో హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. తనలోని మల్టీ టాలెంట్స్‌ను పక్కా ప్లానింగ్‌తో చూపిస్తూ ముందుకు పోతున్న రాహుల్… రీసెంట్‌గా ఆషు రెడ్డితో కలిసి ఉన్న ఫోటోలతో నెట్టింట వైరల్‌ అయ్యారు. ఇదే కాక తన బిగ్ బాస్‌ ఫ్రెండ్ పునర్నవి ఎంగేజ్‌మెంట్‌తో తరువాత తనపై వచ్చిన ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌గా సమాధానం చెప్పి…టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారాడు రాహుల్.

ఇప్పుడీన గురించి ఎందుకని అనుకుంటున్నరా.. ఎందుకంటే మనోడ్ని మిర్యాలగూడ పోరగాళ్లు ఓ ఊకో కాకా అని అన్నారు గనుక. అవును.. రీసెంట్‌గా తన బట్టల షాపు ‘ఊకో కాక’ ను మిర్యాలగూడలో పెట్టిన రాహుల్… ఆ షాపు ఓపెనింగ్ కి అక్కడికి వెళ్లాడు. ఇక ఈ విషయం తెలిసిన మిర్యాలగూడ పోరగాళ్లు ఈ హీరోను చూడ్డానికి ఓ రేంజ్‌లో ఎగబడ్డరు. ఎగబడడమే కాదు.. చిన్నపాటి జాతరనే తలపించేలా చేశారు..!

మరిన్ని ఇక్కడ చదవండి : 

షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

Sudheer Babu’s Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu