AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్యాటకుల స్వర్గధామం.. ‘కాకుల ద్వీపం’..! మనదేశంలోనే ఎక్కడ ఉందో తెలుసా..?

The Island of Crows: పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కేరళలోని ఓ అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే.. కక్కతురుత్.. ఒక చిన్న, ప్రకృతి ఒడిలోని అందమైన ద్వీపం. ఇది అలప్పుజ బ్యాక్ వాటర్స్ మధ్యలో దాగి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత 'నేషనల్ జియోగ్రాఫిక్' మ్యాగజైన్ జాబితాలో చోటు పొందిన ఈ ద్వీపం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

పర్యాటకుల స్వర్గధామం.. 'కాకుల ద్వీపం'..! మనదేశంలోనే ఎక్కడ ఉందో తెలుసా..?
Kerala Tour
Rajashekher G
|

Updated on: Feb 15, 2026 | 11:09 AM

Share

మనదేశంలో అనేక సుందరమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రాల జాబితాలో కేరళ కూడా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కేరళలోని ఓ అద్భుతమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. అదే.. కక్కతురుత్.. ఒక చిన్న, ప్రకృతి ఒడిలోని అందమైన ద్వీపం. ఇది అలప్పుజ బ్యాక్ వాటర్స్ మధ్యలో దాగి ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ‘నేషనల్ జియోగ్రాఫిక్’ మ్యాగజైన్ జాబితాలో చోటు పొందిన ఈ ద్వీపం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ ద్వీపం అలప్పుజ జిల్లా, ఎలుపున్న గ్రామ పంచాయతీ లో ఉంది. అక్కడి మడ అడవులు, వరి పొలాలు, కొబ్బరి తోటలు దానిని ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చేశాయి.

‘కాకుల ద్వీపం’ అని ఎందుకు పిలుస్తారు?

ఈ ద్వీపాన్ని “కాకుల ద్వీపం” అని పిలువడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ప్రతి ఉదయం, వేలాది కాకులు ఈ ద్వీపం నుంచి బయలుదేరి తీరంలో ఆహారం కోసం ఎగురుతాయి. సాయంత్రం సూర్యుడు అస్తమించేటప్పుడు.. అవి తిరిగి ద్వీపంలోని కొబ్బరి చెట్లకు, చెట్ల వైపు గుంపులుగా వస్తాయి. ఈ అద్భుతమైన సన్నివేశం, సంధ్యా వేళ, ఆకాశం కాకులతో నిండిన దృశ్యం, ఈ ద్వీపానికి ఆ పేరు ఇవ్వడానికి ప్రధాన కారణం. మరి మరొక కథనం ప్రకారం, పురాతన కాలంలో ఈ ద్వీపం కాకి ఆకారంలో ఉండేది అనే విశ్వాసం కూడా ఉంది, కానీ అసలైన కారణం ఆ పక్షుల అధిక సంఖ్యే.

కక్కతురుత్ – నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్‌లో స్థానం

2016లో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్, ప్రపంచంలోని 24 ఉత్తమ ప్రదేశాల జాబితాను రూపొందించినప్పుడు.. కక్కతురుత్ కూడా ఇందులో చోటు సంపాదించింది. వారు ఈ ద్వీపాన్ని ‘సూర్యాస్తమయాన్ని చూడటానికి ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశం’ గా అభివర్ణించారు. ఇది ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

కక్కతురుత్ – ఒక స్వర్గంలా అనుభూతి

కక్కతురుత్ ప్రకృతి ప్రేమికుల, పర్యాటకుల కోసం నిజంగా ఒక స్వర్గం. దీని అందం, ప్రశాంతతతోపాటు మీరు అక్కడి ప్రకృతి సంగీతాన్ని, అనుబంధ దృశ్యాలను ఎంతో ఆస్వాదిస్తారు. ఇక్కడ కాల్చిన కార్ప్, కాల్చిన రొయ్యలు, షెల్ఫిష్ వంటి బ్యాక్ వాటర్ వంటకాల ప్రత్యేక రుచి పర్యాటకులకు మరో అనుభూతిని పంచుతుంది.

బ్యాక్ వాటర్స్ చుట్టూ పడవ ప్రయాణం, అక్కడి అందాలను పూర్తిగా అనుభవించడానికి ఒక అద్భుతమైన మార్గం. నిశ్శబ్దమైన నీళ్ల మధ్య, ఆకలి తీర్చిన కాకులు తిరిగి వస్తున్న దృశ్యం, అస్తమించు సూర్యుని ప్రతిబింబం.. ఈ అందం కక్కతురుత్ యొక్క ప్రత్యేకతను మరింత పెంచుతుంది.

అసలు అందాన్ని తెలుసుకోవాలంటే

కక్కతురుత్ నిజమైన ప్రకృతి అందాన్ని అనుభవించాలంటే.. సాయంత్రం 5 గంటలలోపు అక్కడికి చేరుకోవాలి. అప్పుడు సరస్సులో సూర్యాస్తమయం చూస్తూ, వేలాది కాకులు తిరిగి వస్తున్న అద్భుతమైన దృశ్యం చూడటం, పర్యాటకులకు మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఇది ఒక మధుర స్మృతిగా నిలిచిపోతుంది.