Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్..

ఒకవైపు కరోనా ప్రభావం చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ కోవిడ్ వలన ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు సినీ పరిశ్రమ

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్..
Mythri Movie Makers
Follow us

|

Updated on: Aug 16, 2021 | 1:59 PM

ఒకవైపు కరోనా ప్రభావం చిత్రపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికీ కోవిడ్ వలన ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు సినీ పరిశ్రమ తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండే.. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్న సినీ ఇండస్ట్రీని లీకుల బెడద మాత్రం వెంటాడుతూనే ఉంది. చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. సినిమాలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ సైతం సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లీక్ కావడంతో చిత్రయూనిట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుదలకు ముందు రోజు రాత్రి ఇంటర్నెట్‏లో ప్రత్యేక్షమైంది. దీంతో అసలు లీకుల బెడదను నియంత్రించేందుకు మేకర్స్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల కంటెంట్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో సదరు సంస్థ తీవ్రంగా స్పందించింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. ఇటీవల మా మూవీ మెటీరియల్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో మేము చాలా ఆందోళన చెందాము. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సైబర్ క్రైమ్ డిపార్ట్‏మెంట్‏కు ఫిర్యాదు చేశాము. త్వరలోనే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దు అంటూ ట్వీట్ చేసింది.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా.. సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాను క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. అలాగే మహేష్, కీర్తి సురేష్ జంటగా నటిస్తోన్న చిత్రం సర్కారు వారి పాట సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: అందంగా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్ టాప్ హీరోయిన్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ క్యూటీ బుజ్జాయిని గుర్తుపట్టండి..

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు