AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. మొదటి సినిమాతోనే లక్కీ బ్యూటీ అనిపించుకుంది. తన నటనతో తెలుగు

Ileana D'Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..
Illeana
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 16, 2021 | 10:14 PM

Share

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. మొదటి సినిమాతోనే లక్కీ బ్యూటీ అనిపించుకుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా.. అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‏లలో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరనస నటించిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ పై కన్నెసింది. అక్కడ కూడా అమ్మడుకు అదృష్టం తలుపుతట్టింది. వరుస ఆఫర్లను అందుకుంటూ అక్కడ కూడా బిజీగా గడిపేస్తున్న ఈ గోవా బ్యూటీ.. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్ మాస్ మాహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తూనే మరోవైపు రామరావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు. యాక్షన్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లుగా సమాచారం. ఎస్.ఎల్.వి సినిమాస్ ఎల్.ఎల్.పి – ఆర్.టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. రవితేజ నటిస్తున్న ఖిలాడీ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో ఓ స్పెషల్ సాంగ్‏లో రవితేజ సరసన నటించబోతున్నట్లుగా టాక్. ఇప్పటికే ఖిలాడీ మేకర్స్ ఈ గోవా బ్యూటీని సంప్రదించారని తెలుస్తోంది. ఇందుకు ఇలియాన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. గతంలో వీరిద్దరు జంటగా నటించిన కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని వంటి చిత్రాలను మంచి విజయాన్ని అందుకున్నాయి.

Also Read: Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

అందంగా స్మైల్ ఇస్తున్న ఈ చిన్నారి బాలీవుడ్ టాప్ హీరోయిన్.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ క్యూటీ బుజ్జాయిని గుర్తుపట్టండి..

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో