AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి.. సీనియర్ నటి..

సీనియర్ హీరోయిన్ గీతాంజలి.. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో చక్రం తిప్పిన హీరోయిన్. ఆ తర్వాత నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. 1947లో జన్మించిన ఆమె.. దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో రాణించారు. కథానాయికగా, నటిగా అలరించిన ఆమె.. 2019లో ఈ లోకాన్ని వదిలివెళ్లారు. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో మరోసారి తెరపైకి వచ్చాయి.

Tollywood : ఆయన మాట వినడం వల్లే హీరోయిన్ అవకాశాలు తగ్గిపోయాయి.. సీనియర్ నటి..
Geethanjali
Rajitha Chanti
|

Updated on: Feb 15, 2026 | 9:39 AM

Share

సీనియర్ హీరోయిన్ గీతాంజలి గుర్తుందా.. ? ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దాపాటు ఎన్నో హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా మెప్పించారు. సంవత్సరాలపాట అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. 2019లో కన్నుమూశారు. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన కెరీర్ ఆరంభంలో హీరోయిన్‌గా రాణించే చక్కటి అవకాశాలు లభించాయని, అయితే ఆ తర్వాత తన ట్రాక్ మారిందని ఆమె పేర్కొన్నారు. అప్పట్లో హీరోయిన్ సబ్జెక్టులు తన వద్దకు వచ్చేవని, వాటిలో ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన “ఇల్లాలు” చిత్రం ఒక ముఖ్యమైనదని గీతాంజలి గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

సరిగ్గా “ఇల్లాలు” చిత్రం విడుదలయ్యే సమయానికి, పద్మనాభం కామెడీ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని, అందులో “దేవత” కూడా ఒకటని తెలిపారు. ఈ చిత్రంలో రామారావు గారి చెల్లెలి పాత్రను పోషించమని పద్మనాభం గారు తనను అడిగారని గీతాంజలి చెప్పారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పైకి రావాలంటే ఏ పాత్రలు చేయాలి, ఏ పాత్రలు చేయకూడదు అనే దానిపై స్పష్టత లేదని, అంతా అయోమయంగా ఉండేదని ఆమె వివరించారు. ఈ కీలకమైన నిర్ణయం తనదేనా లేక తల్లిదండ్రులదా అని అడిగినప్పుడు, తన తండ్రి సలహా మేరకు ఈ పాత్రను అంగీకరించినట్లు గీతాంజలి వెల్లడించారు. “పద్మనాభం గారి పక్కన అయితే ఏంటి? ఇది ఒక మంచి చిలిపి క్యారెక్టర్ కదా” అని తన తండ్రి ప్రోత్సహించారని, ఆయన మాట విని ఆ పాత్రను చేశానని తెలిపారు. ఆ తర్వాత నుండే తన క్యారెక్టర్ల ఎంపిక మారిందని గీతాంజలి పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

తాను స్వతహాగా ఏ రకమైన పాత్రలను ఎక్కువగా ఇష్టపడ్డారని అడిగినప్పుడు, తనకు మంచి పాత్రలు చేయాలనే కోరిక ఉండేదని ఆమె చెప్పారు. పద్మనాభంతో కలిసి “పోలరంగడు”, “ధర్మదాత”, “అదృష్టవంతులు” వంటి అనేక చిత్రాలలో తాను జంటగా నటించినట్లు తెలిపారు. ప్రతి పాత్ర తనను ఆకట్టుకోవాలని కోరుకునేదానినని, హీరోయిన్‌గా మాత్రమే చేస్తేనే ఒక ఇదా అనే భావన తనకు కలిగిందని ఆమె వివరించారు. “కాలం మారింది” చిత్రంలో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శోభన్ బాబు, శారద లతో పాటు తాను కూడా ఒక చిలిపి పాత్ర పోషించినట్లు గీతాంజలి గుర్తుచేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

Geethanjali Movies

Geethanjali Movies

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

Follow Us