AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheer Babu’s Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..

యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Sudheer Babu's Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..
Sudheer Babu
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2021 | 7:12 PM

Share

Sudheer Babu’s Sridevi Soda Center: యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. శివ మనసులో శృతి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆతర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ హీరో.. ఆ మార్క్ ఎక్కడ కనిపించనుకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. సుధీర్ బాబు కెరియర్‌‌‌‌ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తనకి నచ్చిన కథలకు .. పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.  ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో  తెరకెక్కిన సమ్మోహనం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సుధీర్ బాబు. ఆతర్వాత రీసెంట్‌‌‌గా వి అనే సినిమాలో నటించాడు. కరోనా సమయంలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. కానీ సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ మూవీలో లైటింగ్ సూరిబాబు అనే పాత్రలో నటిస్తున్నాడు ఈ కుర్ర హీరో. అలాగే హీరోయిన్ ఆనంది సోడాల శ్రీదేవి పాత్రలో కనిపించనుంది.

అయితే ఈ సినిమాలో అందమైన ప్రేమకథతోపాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశలు కూడా ఉంటాయని తెలుస్తోంది. పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క మ్యాచో బాడీతో సుధీర్ బాబు ఆకట్టుకోనున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో భారీ బోట్ ఛేజ్ కూడా ఉండనుంది. దడపా 80కి పైగా పడవలతో ఓ ఛేజింగ్ సీన్ ఉండనుందట. గోదావరిలో 84 పడవలలో ఫైటర్స్ పాల్గొనగా ఈ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారట. సుధీర్ బాబు డూప్ లేకుండా ఈ యాక్షన్ సీన్ లో పాల్గొనడం విశేషమని చెబుతున్నారు. బోట్ నడపడంలో కొంతకాలం పాటు సుధీర్ బాబు శిక్షణ తీసుకున్న తరువాతనే ఈ సీన్ చేశామని చిత్రయూనిట్ చెప్తుంది. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ విజయ్ చిల్లా- శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదారి పరిసరాల్లో సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ నెల 27వ తేదీన శ్రీదేవి సోడా సెంటర్ థియేటర్లలో విడుదల కానుంది. అలాగే ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో ఉప్పెన చిన్నది కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..