Sreemukhi : పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నా కానీ.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న అందాల యాంకర్..

వెండి తెరపై బుల్లితెరపై రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో శ్రీముఖి ఒకరు. ఈ బ్యూటీ తన అందంతో చలాకీతనంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. షో ఏదైనా తన మాటలతో ఇట్టే ఆకట్టుకుంటుంది..

Sreemukhi : పెళ్లి చేసుకోవడానికి నేను రెడీగానే ఉన్నా కానీ.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న అందాల యాంకర్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 16, 2021 | 10:03 PM

Sreemukhi : వెండి తెరపై బుల్లితెరపై రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో శ్రీముఖి ఒకరు. ఈ బ్యూటీ తన అందంతో చలాకీతనంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. షో ఏదైనా తన మాటలతో ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ బాబ్లీ బ్యూటీ. ఇప్పటికే పలు టీవీ షోలతో ఆకట్టుకున్న శ్రీముఖి.. ఇప్పుడు సినిమాల్లోనూ రాణిస్తూ ఆదరగొడుతుంది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌గా  నటించిన శ్రీముఖి ఆతర్వాత హీరోయిన్‌‌‌‌గా మారింది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్‌‌‌‌గా నాటింది శ్రీముఖి. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మనో, రాజా రవీంద్ర, భరణిల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది. ఈ సినిమాను గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించగా ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే శ్రీముఖి పెళ్లిపై ఇప్పటికే చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్‌‌‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌‌‌‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి పాల్గొంది. తనదైన చలాకీతనంతో, అల్లరితో అందంతో ఆ గేమ్‌‌‌‌షో‌‌‌‌కు మరింత ఆకర్షణ తెచ్చింది ఈ బ్యూటీ. ఇక హౌస్‌‌‌‌లో ఉన్నవారితో పోటాపోటీగా ఆడి ఫైనల్స్‌‌‌‌‌కు చేరుకుంది. చివరకు బిగ్ బాస్ సీజన్ 3 రన్నరప్‌‌‌‌గా నిలించింది శ్రీముఖి. ఆ సమయంలో తనకు బ్రేకప్ అయ్యిందని, ప్రముఖ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయ్యిందని చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది. ఇక అప్పటి నుంచి శ్రీముఖి పెళ్లిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ సినిమా ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా బిజీ బిజీగా ఉన్న ఈ చిన్నది మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పింది. కానీ నచ్చిన వాడు, మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని అంది. ఏదైనా మన అదృష్టాన్ని బట్టే జరుగుతుందన్నా ఈ బ్యూటీ తనకు 31ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sudheer Babu’s Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..