Nayanthara: తన వివాహంపై తొలిసారి స్పందించిన నయనతార.. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పెళ్లి చేసుకోనని వ్యాఖ్య.

Nayanthara: తన వివాహంపై తొలిసారి స్పందించిన నయనతార.. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పెళ్లి చేసుకోనని వ్యాఖ్య.
Nayanathara

Nayanthara About Marriage: కేవలం సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అందాల తార నయన తార. 2003లో మలయాళ చిత్ర పరిశ్రమతో ఇండస్ట్రీ..

Narender Vaitla

|

Aug 16, 2021 | 6:56 PM

Nayanthara About Marriage: కేవలం సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు అందాల తార నయన తార. 2003లో మలయాళ చిత్ర పరిశ్రమతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే టాప్‌ హీరోయిన్‌ల జాబితాలో నిలిచారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 18 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకుపోతోందీ చిన్నది. ఇక తెలుగులో ‘లక్ష్మీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయన.. ఇక్కడ కూడా తనదైన మార్కు సంపాదించుకుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిన నయన తార ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. సినిమాలు, సినిమాల్లో రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్తలతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచే నయన తార తన వ్యక్తిగత జీవితం ద్వారా కూడా గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు.

గతంలో ప్రభుదేవాతో ప్రేమలో ఉన్న నయన.. అతనితో పెళ్లి పీటలు కూడా ఎక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. ఇక అనంతరం తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయన సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేయడంతో ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించారు. అసలు విషయం చెప్పకుండానే ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఇక వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటు నయనతార కానీ, అటు విఘ్నేష్‌ కానీ తమ రిలేషన్‌ గురించి ఎక్కడా ఓపెన్‌ అయ్యింది లేదు. వీరి వివాహానికి సంబంధించి ఎలాంటి వార్తలు వచ్చినా ఈ జంట ఇంత వరకు స్పందించలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నయనతార వేలికి ఉంగరం ఉండడంతో నయనతార ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని అంతా అనుకున్నారు. యాంకర్‌ ఇదే ప్రశ్నను అడగగా ఇది ప్రత్యేకమైందంటూ మాట దాటేసిందీ అందాల తార.

ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో నయనతార తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ప్రేమ, పెళ్లి విషయంపై తొలిసారి స్పందించిన ఈ అమ్మడు.. ‘మా ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షంలో మా నిశ్చితార్థం జరిగింది. పెద్దగా సంబరాలు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే నిశ్చితార్థం జరుపుకున్నాం. విఘ్నేష్‌తో నా వివాహం ఎప్పుడన్నది ఇంకా ఖరారు కాలేదు. ముహూర్తం ఫిక్స్‌ అయిన వెంటనే అభిమానులకు తెలుపుతాను. ఎట్టి పరిస్థితుల్లో రహస్య వివాహం మాత్రం చేసుకోను. వృత్తిపరంగా మా గోల్స్‌ను సాధించే పనిలో మేం బిజీగా ఉండటం వల్లే ఇప్పటివరకు పెళ్లి గురించి సరైన నిర్ణయం తీసుకోలేదు. విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటి పోయాడు. ఆయన నాకు కాబోయే భర్త. మీడియా కూడా ఇకపై వారి కథనాల్లో ఇలాగే రాస్తారని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.

Also Read: Allari Subhashini : సీఎం కేసీఆర్ నా ప్రాణ దాత ఆయన లేకపోతే.. కన్నీరు పెట్టుకున్న నటి అల్లరి సుభాషిణి.

Mythri Movie Makers : ఇలా చేస్తే సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది.. ఆవేదన వ్యక్తం చేసిన మైత్రి మూవీ మేకర్స్ అధినేత

Nisha Agarwal: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు… సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సిస్టర్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu