AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nisha Agarwal: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు… సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సిస్టర్..

చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది.

Nisha Agarwal: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు... సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్ సిస్టర్..
Nisha
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2021 | 10:06 PM

Share

Nisha Agarwal: చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌‌‌గా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకతంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌‌‌గా నటిస్తుంది. ఈ సినిమాలతోపాటు బాలీవుడ్‌‌‌‌లోనూ ఓ మూవీ చేస్తుంది ఈ భామ. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్‌‌‌‌గా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగులో వరుణ్ సందేశ్ నటించిన ఏమైంది ఈవేళ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా నటించిన సోలో సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేసింది. సుకుమారుడు, సరదాగా అమ్మాయితో వంటి సినిమాల్లో నటించింది. వీటిలో సోలో సినిమా పర్లేదు అనిపించుకున్నా మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ఈ అమ్మడు కనిపించకుండా పోయింది. ఆ తరువాత పెళ్లిచేసుకొని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది నిషా.

సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌‌‌‌లోనే ఉంటుంది ఈ బ్యూటీ. ఓటీటీల పుణ్యమా అని పెళ్లితర్వాత సినిమాలకు దూరమైన హీరోయిన్స్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా ఓటీటీ కంటెంట్‌‌‌‌‌తో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. పెళ్లి అయ్యి బాబుకు జన్మనిచ్చినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. కనుక ఓటీటీలో సక్సెస్ అయితే ఫీచర్ ఫిల్మ్‌‌‌‌లో కూడా యంగ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఈ అమ్మడు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..