AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మెగాస్టార్ ఇంటికి సినీపెద్దలు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌‌‌తో భేటీ పై సాగిన చర్చ.. సమస్యల పరిష్కారం ప్ర‌ధాన డిమాండ్‌‌‌గా..

క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్‌‌‌‌లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి..

Tollywood: మెగాస్టార్ ఇంటికి సినీపెద్దలు.. ఏపీ సీఎం జ‌గ‌న్‌‌‌తో భేటీ పై సాగిన చర్చ.. సమస్యల పరిష్కారం ప్ర‌ధాన డిమాండ్‌‌‌గా..
Megastar
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2021 | 5:50 PM

Share

Tollywood: క‌రోనా క్రైసిస్ నేప‌థ్యంలో సినీప‌రిశ్ర‌మ స‌మస్య‌ల‌పైనా.. అలాగే ఆంధ్రప్ర‌దేశ్‌‌‌‌లో టిక్కెట్టు రేట్ల స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చించేందుకు ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిన సంగ‌తి తెలిసిందే. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో సీఎంకి విన్న‌వించాల్సిన అన్ని విష‌యాల‌పైనా కూలంకుశంగా చ‌ర్చించి వెళ్లాల‌న్న ఉద్దేశంతో ఇండ‌స్ట్రీ మీటింగ్ హైద‌రాబాద్ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జ‌రిగింది.

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిలించాంబ‌ర్ అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్, కింగ్ నాగార్జున, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఆర్. నారాయణమూర్తి, దిల్ రాజు, కే.ఎస్. రామారావు , దామోదర్ ప్రసాద్, ఏషియన్ సునీల్, స్రవంతి రవికిశోర్ , సి. కళ్యాణ్, ఎన్వి. ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమిని కిరణ్, సుప్రియ భోగవల్లి బాబీ యూవీ క్రియేషన్స్ విక్కీ – వంశీ ఇలా..నిర్మాత‌ల సంఘం.. పంపిణీ, ఎగ్జిబిష‌న్ రంగాల నుంచి ప్ర‌తినిధులు ఈ సమావేశానికి హాజ‌ర‌య్యారు. ఇటీవ‌ల ఏపీలో వ‌చ్చిన జీవోలో ఉన్న‌వాటిపై చ‌ర్చించారు. సీఎంతో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గాలేమిటి? అన్న‌దానిపై సినీ పెద్దలు చ‌ర్చించారు. అన్నిటిని త్వరగా ప‌రిష్క‌రించాల‌న్న‌ది ప్ర‌ధాన డిమాండ్. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌ల‌పైనా కూడా సీఎంతో భేటీలో చ‌ర్చించ‌నున్నారు. ముఖ్యంగా ఈ భేటీలో టిక్కెట్టు రేట్ల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ్రామ పంచాయితీ, న‌గ‌ర పంచాయితీ, కార్పొరేష‌న్ ఏరియాల్లో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ఏం అడ‌గాలి? చిన్న సినిమాల మనుగడకోసం ఐదో షో విషయమై చర్చించుకోవడం జరిగింది. ఇండస్ట్రీలో నెలకొన్న అసంతృప్తిలపై సానుకూల వాతావరణం వచ్చేలా  అందరూ కలిసి చర్చించుకోవడం జరిగింది. అలాగే పరిశ్రమలో అన్ని భాగాల్లో ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కూలంకుషంగా చర్చించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..